Sumanth: సుమంత్.. ‘మ‌హేంద్ర‌గిరి వారాహి’ టైటిల్ లుక్ చూశారా

ABN , First Publish Date - 2023-11-17T14:43:25+05:30 IST

అక్కినేని వారి మ‌నుమ‌డు సుమంత్ మ‌ళ్లీ ఓ ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్‌తో వ‌స్తున్నాడు. తాజాగా ఇప్పుడు హీరోగా ‘మ‌హేంద్ర‌గిరి వారాహి’ అనే ఓ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి సైన్ చేశాడు. ఇటీవ‌లే విశాఖ‌లో స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స‌మ‌క్షంలో ఈ సినిమా పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి చిత్ర టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు.

Sumanth: సుమంత్.. ‘మ‌హేంద్ర‌గిరి వారాహి’ టైటిల్ లుక్ చూశారా
sumanth

అక్కినేని వారి మ‌నుమ‌డు సుమంత్ (Sumanth) మ‌ళ్లీ ఓ ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్‌తో వ‌స్తున్నాడు. ఈ మ‌ధ్య క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా కూడా మారిన ఆయ‌న సినిమాల విష‌యంలో స్లో అండ్ స్ట‌డీగా వెళుతున్నారు. తన సినీ కెరీర్ ఊహించినంత స్పీడ్‌గా లేకున్నా అడ‌పాద‌డ‌పా ఓ ఆస‌క్తిక‌ర‌మైన స‌బ్జెక్టుతో సుమంత్ అంటే ఎదో కొత్త‌ద‌నం ఉంటుంద‌నేలా సినిమాలు చేస్తూ ప్రేక్షుల‌ను అల‌రిస్తూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చేసిన సినిమాల్లో ‘ప్రేమ‌క‌థ‌, స‌త్యం, గోదావ‌రి, మ‌ల్లీ రావా, గోల్కొండ హైస్కూల్‌, మ‌ధుమాసం’ వంటి అల్‌టైమ్ క్లాసిక్స్ ఉన్నాయి.

1999లో రామ్‌గోపాల్ వ‌ర్మ ప్రేమ‌క‌థ‌తో సినిమాల్లోకి అడుగుపెట్టిన సుమంత్ ఇప్ప‌టివ‌ర‌కు 30 నుంచి 35 సినిమాలు చేసినప్ప‌టికీ స్టార్ స్టేట‌స్‌ను మాత్రం ద‌క్కించుకోలేక పోయాడు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 25 సంవ‌త్స‌రాలు కావ‌స్తున్నా చాలా సెల‌క్టివ్‌గా సినిమాలు ఎంపిక చేసుకుంటూ నేను ఇండ‌స్ట్రీలోనే ఉన్నానని అనిపిస్తుంటాడు. ప్ర‌తీసారి కొత్త నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తూ మీడియం రేంజ్ హీరోగా స్థిర‌ప‌డ్డాడు. ఇదిలాఉండ‌గా 2017లో మ‌ళ్లీరావా సినిమా ద్వారా జెర్సీ ఫేమ్‌ గౌత‌మ్ తిన్న‌నూరిని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌డం విశేషం.


సుమంత్ (Sumanth) చివ‌ర‌గా ధ‌నుష్‌, సార్‌, సీతారామం సినిమాల్లో క‌నిపించిన ఆయ‌న మ‌ళ్లీ ఇప్పుడు హీరోగా ‘మ‌హేంద్ర‌గిరి వారాహి’ (Mahendragiri Vaarahi) అనే ఓ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి సైన్ చేశాడు. ఇటీవ‌లే విశాఖ‌లో స్వ‌రూపానందేంద్ర స‌ర‌స్వ‌తి స‌మ‌క్షంలో ఈ సినిమా పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి చిత్ర టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు.

‘రంగమార్తాండ’ వంటి సినిమా తర్వాత రాజ‌శ్యామ‌ల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌కుడిగా, మీనాక్షి గోస్వామి (Minakshi goswamy) క‌థానాయిక‌గా పరిచ‌యం అవుతున్నారు. చూడాలి ఈ సినిమా అయినా సుమంత్‌కు సాలీడ్ స‌క్సెస్ ఇస్తుందేమో.

Updated Date - 2023-11-17T14:52:49+05:30 IST