Pushpa 2: సుక్కూ ఏం చేస్తున్నారు?

ABN , First Publish Date - 2023-05-06T10:23:43+05:30 IST

పుష్పరాజ్‌ పాత్రతో ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఓ ఊపు ఊపారు అల్లు అర్జున్‌. గత ఏడాది విడుదలైన ‘పుష్ప’ చిత్రం అదరగొట్టే కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది.

Pushpa 2: సుక్కూ ఏం చేస్తున్నారు?

పుష్పరాజ్‌ (Pushpraj) పాత్రతో ప్యాన్‌ ఇండియా స్థాయిలో ఓ ఊపు ఊపారు అల్లు అర్జున్‌(Allu arjun). గత ఏడాది విడుదలైన ‘పుష్ప’ (pushpa 2) చిత్రం అదరగొట్టే కలెక్షన్లతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయింది. ఆ సినిమా ఫలితంతో అంతే జోరుగా సుకుమార్‌ ‘పుష్ప-2’ తెరకెక్కిస్తున్నారు. మొదటిపార్ట్‌ సాధించిన విజయంతో ‘పుష్ప-2’ అంతకుమించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు లెక్కల మాస్టర్‌ (Sukumar). ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్‌ పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ఒడిస్సాలోని కలిమెల జిల్లా మన్యంకొండ పంచాయతీ పొల్లేరు గ్రామంలో సందడి చేస్తున్నారు. చిత్రకరణలో భాగంగా లొకేషన్‌ల వేటలో పడ్డారు చిత్ర బృందం. మైత్రీమూవీ మేకర్స్‌ సంస్థ ప్రొడక్షన్‌ మేనేజర్‌ పి.వేంకటేశ్వరరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ ఏప్రిల్‌లో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. మల్కన్‌గిరి కలెక్టర్‌ విశాల్‌సింగ్‌, ఎస్పీ నితీష్‌లను కలిసి, షూటింగ్‌ నిమిత్తం అనుమతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 20మందితో కూడిన బృందం దర్శకుడు సుకుమార్‌, సినిమాటోగ్రఫీ మిరస్లోవ్‌ కుబా బ్రోచెక్‌ తదితరులు షూటింగ్‌ చేయనున్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. (Location recce For Pushpa 2)

Untitled-1.jpg

ఈ సందర్భంగా సుకుమార్‌ మాట్లాడారు. ప్రకృతి సౌందర్యానికి మల్కన్‌గిరి జిల్లా పెట్టింది పేరని అన్నారు. పొల్లేరు ప్రాంతంలో మరో 2 నెలల్లో షూటింగ్‌ ప్రారంభిస్తామని, ‘పుష్ప’ ఎంతటి ఘన విజయం సాధించిందో, రెండో భాగం కూడా అదే స్థాయిలో అలరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి స్వాభిమాన్‌ ఏరియా హంతాళ్‌గూడ ఘాట్‌ రోడ్డు, బలిమెల రిజర్వాయర్‌, పొల్లేరు చుట్టుపక్కల ఉన్న వంతెనలు, నదులు, కాలువలు ఉన్న పరిసరాల్లో చిత్రీకరణ చేయడానికి చూస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న చిత్రీకరణలో అల్లు అర్జున్‌, రష్మిక, సునీల్‌ తదితరులు పాల్గొనున్నట్లు చెప్పారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

1.jpg

Updated Date - 2023-05-06T10:28:40+05:30 IST