Sukumar: కార్తిక్‌ ఆ సమస్యను దాటుకుని సినిమా తీశాడు!

ABN , First Publish Date - 2023-04-17T13:53:38+05:30 IST

విరూపాక్ష’ దర్శకుడు కార్తిక్‌ దండు గురించి కీలక విషయాలను బయటపెట్టారు దర్శకుడు సుకుమార్‌. గతంలో కార్తిక్‌ తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడ్డాడని చెప్పారు. ఏలూరులో జరిగిన ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ

Sukumar: కార్తిక్‌ ఆ సమస్యను దాటుకుని సినిమా తీశాడు!

‘విరూపాక్ష’ (Virupaksha) దర్శకుడు కార్తిక్‌ దండు గురించి కీలక విషయాలను బయటపెట్టారు దర్శకుడు సుకుమార్‌(Sukumar). గతంలో కార్తిక్‌ తీవ్ర ఆరోగ్య (Karthik Health issues) సమస్యతో బాధపడ్డాడని చెప్పారు. ఏలూరులో జరిగిన ‘విరూపాక్ష’ ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ

‘‘కొన్నాళ్ల క్రితం కార్తీక్‌ నాకొక కథ చెప్పాడు. ఆ కథ నచ్చలేదు. కానీ, అతడు చెప్పిన విధానం నచ్చింది. దాంతో వేరే కథతో రమ్మని చెప్పా. కొంతకాలానికి ‘విరూపాక్ష’ కథతో వచ్చాడు. అది నాకెంతో నచ్చింది. ఆ తర్వాత నిర్మాత, హీరోకు కూడా ఆ కథ వినిపించాడు. అలా ఈ ప్రాజెక్ట్‌ ట్రాక్‌లోకి వచ్చింది. కార్తిక్‌ నన్ను కలిసినప్పుడు అతడికి ఓ ఆరోగ్య సమస్య ఉన్నట్లు తెలిసింది. స్టెరాయిడ్స్‌తో బతికేవాడు. అవి తీసుకుంటే తప్ప అతనికి ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పెరిగేది కాదు. అలాంటి స్థితి నుంచి బయటపడి ఈ సినిమా తీశాడు. ఇప్పుడు కార్తిక్‌ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంతో కార్తిక్‌కు మంచి పేరొస్తుంది. ఈ కథకు కావలసిన టీమ్‌ కుదిరింది. అందరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. హీరోయిన్‌గా సంయుక్త అని చెప్పగానే భయపడ్డాను. కానీ బాగా చేసింది. దిల్‌ రాజు గారి అమ్మాయి పెళ్లిలో సాయిని కలిశా. అతను అందరినీ నవ్విస్తూ ఉంటాడు.. విరూపాక్ష సెట్లోనే మళ్లీ చూశా. ఆ రోజు సెట్‌లో ఒక్కొక్క అక్షరాన్ని పట్టి పట్టి నేర్చుకుంటున్నాడు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇది నటుడిగా పునర్జన్మలాంటిది’’ అని అన్నారు. (Virupaksha Pre Release)

సాయిధరమ్‌ తేజ్‌(Sai dharam tej), సంయుక్తామీనన్‌ (Samyuktha menon) జంటగా నటించిన మిస్టీక్‌ థ్రిల్లర్‌ ఇది. కార్తిక్‌ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్‌ ఈ చిత్రానికి స్ర్కీన్‌ప్లే అందించారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 21న ఈ చిత్రం విడుదలకానుంది’’ అని అన్నారు.

Updated Date - 2023-04-17T14:05:17+05:30 IST