Sudigaali Sudheer - Rashmi : ఆ ప్రపోజల్‌ ఉంది.. టైమ్‌ కోసం చూస్తున్నాం!

ABN , First Publish Date - 2023-11-21T21:22:50+05:30 IST

సుధీర్‌ - రష్మి గౌతమ్‌.. ఈ జంట గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై వీరిద్దిరికీ ఉన్న క్రేజ్‌, ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

Sudigaali Sudheer - Rashmi : ఆ ప్రపోజల్‌ ఉంది.. టైమ్‌ కోసం చూస్తున్నాం!

సుధీర్‌ (sudheer)- రష్మి గౌతమ్‌(Rashmi gautham).. ఈ జంట గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై వీరిద్దిరికీ ఉన్న క్రేజ్‌, ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాంటిది ఏమీ లేదని చాలా సందర్భాల్లో ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు.

సుధీర్‌ బుల్లితెరపై యాంకర్‌గా బిజీగా ఉంటూనే సినిమాల్లోనూహీరోగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ుకాలింగ్‌ సహస్ర’. అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుధీర్‌ సరసన డాలీ కథానాయికగా నటించింది. డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రష్మి - సుధీర్‌ జంట గురించి టాపిక్‌ వచ్చింది. రష్మితో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు అన్న ప్రశ్నకు సుధీర్‌ సమాధానం చెబుతూ ‘‘నేను, రష్మి ఇద్దరం కథలు వింటున్నాం. మా ఇద్దరికీ కామన్‌గా నచ్చిన కథ ఇప్పటి వరకు దొరకలేదు. అలాంటిది దొరికితే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తాం. ఇద్దరం కలిసి సినిమా చేయాలనే ప్రపోజల్‌ ఉంది’’ అని అన్నారు.

‘కాలింగ్‌ సహస్ర’ (Calling sahasra) గురించి మాట్లాడుతూ.. ‘ఈ రోజుల్లో ఒక సినిమా హిట్‌ అయితే దానికి ముఖ్య కారణం కంటెంట్‌. మా సినిమాకు కథే బలం. సుధీర్‌ని దృష్టిలో పెట్టుకుని కాకుండా ఓ మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చూడాలని వెళ్తే ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు. హీరోగా నా మూడో చిత్రమిది. నా సినిమాలకు నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. అలాగే సినిమాలు నచ్చితే అదే విషయాన్ని పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది’’ అన్నారు.

Updated Date - 2023-11-21T21:31:26+05:30 IST