Harom Hara : ఉడిపిలో కీలక షెడ్యూల్‌ పూర్తి!

ABN , First Publish Date - 2023-07-20T20:44:28+05:30 IST

సుధీర్‌బాబు (SudheerBabu) హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’ (Harom Hara). సెహరి ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక (Jnana sagar Dwaraka) దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘

Harom Hara : ఉడిపిలో కీలక షెడ్యూల్‌ పూర్తి!

సుధీర్‌బాబు (SudheerBabu) హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’ (Harom Hara). సెహరి ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక (Jnana sagar Dwaraka) దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌) బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. సుధీర్‌ బాబు బర్త్‌ డే కానుకగా విడుదలైన ‘హరోం హర’ ఫస్ట్‌ ట్రిగ్గర్‌ గ్లింప్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసింది. తాజాగా ఈ చిత్రం ఉడిపిలో కీలకమైన షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

అనంతరం సుధీర్‌బాబు కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ ఫొటోలను ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథన్‌, ఎడిటింగ్‌! రవితేజ గిరిజాల.

Updated Date - 2023-07-20T20:44:48+05:30 IST