సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pawan kalyan: పవన్‌తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

ABN, First Publish Date - 2023-04-04T21:43:55+05:30

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీష్‌ శంకర్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదాయ సీతమ్‌’ రీమేక్‌ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (pawan kalyan) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’9harihara veeramallu), హరీష్‌ శంకర్‌తో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’(Ustad bhagatsingh), సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదాయ సీతమ్‌’ రీమేక్‌ చేస్తున్నారు. వీటితోపాటు సుజీత్‌ దర్శకత్వంలో ‘ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌’(OG) చిత్రంతో చేస్తున్నారు. ఇవి కాకుండా ఆయనతో ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉందని యువ దర్శకుడు మంగళవారం వెల్లడించారు. ఆయనే సుధీర్‌వర్మ. (sudheer Varma to direct Pawan kalyan)

తాజాగా ఆయన రవితేజతో ‘రావణాసుర’ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్‌వర్మ ఈ విషయాన్ని బయటపెట్టారు. చాలా కాలం క్రితమే పవన్‌తో తన సినిమా ఫిక్సయిందని సుధీర్‌వర్మ చెప్పారు. ‘కేశవ’ చిత్రం సమయంలోనే త్రివిక్రమ్‌ ఓ లైన్‌ ఇచ్చి డెవలప్‌ చేయమన్నారని, దానిపై వర్క్‌ జరుగుతోందని తెలిపారు. దీనికి మెయిన్‌ స్టోరీ త్రివిక్రమ్‌దేనని(Trivikram), ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలు త్వరలోనే వెలడిస్తామని చెప్పారు. పవన్‌కల్యాణ్‌ హీరో, త్రివిక్రమ్‌ కథ అంటే తప్పకుండా ఈ చిత్రం హారికా అండ్‌ హాసినీ బ్యానర్‌లోనే ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - 2023-04-08T00:57:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!