కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harom Hara: నవంబర్ 22న.. సుధీర్ బాబు 'పవర్ ఆఫ్ సుబ్రమణ్యం' ఫ‌స్ట్ లుక్‌

ABN, First Publish Date - 2023-11-13T21:02:20+05:30

హీరో సుధీర్ బాబు తాజాగా న‌టిస్తున్న చిత్రం ‘హరోం హర’. పాన్ ఇండియాగా వ‌స్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటివరకు సుధీర్ బాబు, సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, ది ఫస్ట్ ట్రిగ్గర్ అనే గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ దీపావళి పండుగ సంద‌ర్భంగా కొత్త అప్‌డేట్‌ వచ్చారు. నవంబర్ 22న 'పవర్ ఆఫ్ సుబ్రమణ్యం'ను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

HAROM HARA

sudheer babu

హీరో సుధీర్ బాబు(sudheer babu) తాజాగా న‌టిస్తున్న చిత్రం ‘హరోం హర’(Harom Hara). పాన్ ఇండియాగా వ‌స్తున్న ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వ‌హిస్తుండ‌గా ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నాడు. సుధీర్‌ బాబు కెరీర్‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్న‌ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావస్తోంది.

ఇప్పటివరకు సుధీర్ బాబు, సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, ది ఫస్ట్ ట్రిగ్గర్ అనే గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ దీపావళి పండుగ సంద‌ర్భంగా కొత్త అప్‌డేట్‌ వచ్చారు. నవంబర్ 22న 'పవర్ ఆఫ్ సుబ్రమణ్యం'ను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేయ‌గా పోస్టర్‌లో సుధీర్ ఫెరోసియస్ అవతార్‌లో కనిపించారు.


చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నారు. ఈ చిత్రానికి అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తుండ‌గా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - 2023-11-13T21:03:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!