SudheerBabu: సుధీర్ బాబు 150 కిలోల అబ్బాయిగా

ABN , First Publish Date - 2023-01-24T12:36:05+05:30 IST

సుధీర్ బాబు (Sudheer Babu) రాబోయే సినిమా 'మాయా మశ్చీంద్ర' (Maya Maschindra) ట్రిపిల్ రోల్ (Sudheer Babu is doing triple role) చేస్తున్నాడు అని చెప్పాడు. హర్షవర్ధన్ (Harshavardhan) దీనికి దర్శకుడు.

SudheerBabu: సుధీర్ బాబు 150 కిలోల అబ్బాయిగా

సుధీర్ బాబు (Sudheer Babu) రాబోయే సినిమా 'మాయా మశ్చీంద్ర' (Maya Maschindra) ట్రిపిల్ రోల్ (Sudheer Babu is doing triple role) చేస్తున్నాడు అని చెప్పాడు. హర్షవర్ధన్ (Harshavardhan) దీనికి దర్శకుడు. ఇందులో సుధీర్ బాబు 150 కిలోల బరువున్న అబ్బాయిగా కూడా ఒక రోల్ లో కనిపిస్తాడు (Sudheer Babu is playing a role which he weighs 150 kilos) అని సుధీర్ బాబు చెప్పాడు. ఇంకొకటి మామూలుగా కనిపించే అబ్బాయి, ఇంకో పాత్ర లో సిక్స్ పాక్ చూపిస్తున్నాడు. ఇలా మూడు పాత్రల్లో రాబోయే సినిమాలో కనిపించనున్నాడని చెప్పాడు. ఇది చాల కష్టమయిన సినిమా అని, సంవత్సరం పైగా చిత్రీకరణ అవుతోందని, ఇంకా చాలా ఉందని కూడా చెప్పాడు. ఇంకో సినిమా అభిలాష్ అనే అతను దర్శకత్వం చేస్తున్నాడు. అది తండ్రి కొడుకుల మధ్య వుండే భావోద్వేగాల మీద నడుస్తుంది ఆ సినిమా. ఇది యు.వి. క్రెయేషన్స్ నిర్మిస్తున్నారు. (UV Creations)

sudheerbabu2.jpg

ఇప్పుడు సుధీర్ బాబు 'హంట్' (Hunt) అనే సినిమాతో ఈ వారం వస్తున్నాడు. ఇది ముఖ్యంగా స్నేహం మీద నడిచే కథ అని చెప్తున్నాడు సుధీర్ బాబు. ఇందులో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ గా వేస్తున్నాడు. ఒక కేసు దర్యాపు చేస్తుండగా మధ్యలో ఎదో జరిగి గతం అలాగే ఆ కేసు గురించి కూడా మరిచిపోతాడు, కానీ మళ్ళీ అన్నీ గుర్తుకు తెచ్చుకొని తాను ఎలా ఆ కేసు ఛేదించాడు అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ సినిమాకి మహేష్ (Mahesh) అనే అతను దర్శకుడు. ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) గారికి అంకితం ఇచ్చారు.

Updated Date - 2023-01-24T12:36:07+05:30 IST