SudheerBabu: పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఇప్పట్లో లేనట్టే

ABN , First Publish Date - 2023-01-24T13:09:40+05:30 IST

పుల్లెల గోపీచంద్ బయోపిక్ (Pullela Gopichand Biopic) ఎప్పటి నుండో మాట్లాడుతున్నాడు కానీ, సుధీర్ బాబు (Sudheer Babu) ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా మీద క్లారిటీ గా (Clarity about Gopichand biopic) చెప్పేసాడు సుధీర్ బాబు.

SudheerBabu: పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఇప్పట్లో లేనట్టే

పుల్లెల గోపీచంద్ బయోపిక్ (Pullela Gopichand Biopic) ఎప్పటి నుండో మాట్లాడుతున్నాడు కానీ, సుధీర్ బాబు (Sudheer Babu) ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా మీద క్లారిటీ గా (Clarity about Gopichand biopic) చెప్పేసాడు సుధీర్ బాబు. ఎందుకంటే సుధీర్ బాబు, గోపీచంద్ ఇద్దరూ క్లాస్ మేట్స్ (Classmates) అందుకని గోపీచంద్ బయోపిక్ తనే చేస్తాను అని చెప్పాడు సుధీర్ బాబు. అయితే ఆ సినిమా గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నాడు. రెండు పార్టులు చేద్దామా (Two parts), లేక ఒక పార్టు తీద్దామా, లేక వెబ్ సిరీస్ (Web series) చెయ్యాలా అని ఇంకా చాలా చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాడు. టైమ్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర ఈ సినిమా హక్కులు వున్నాయి. అయితే అది స్టార్ట్ అవటం మాత్రం నేను ఇంకో మూడు నాలుగు సినిమాలు చేసాక గోపీచంద్ బయోపిక్ స్టార్ట్ అవొచ్చు అని అనుకుంటున్నాను అని చెప్పాడు సుధీర్ బాబు. ఆ సినిమా గురించి అయితే ఇంకా చర్చలు మాత్రమే జరుగుతున్నాయి అని చెప్తున్నాడు. అందుకని కొన్ని సంవత్సరాల వరకు ఈ గోపీచంద్ బయోపిక్ గురించి మాట్లాడనవసరం లేదు. (It may take another few years to take up Gopichand biopic project)

sudheerbabu3.jpg

ఇక ప్రస్తుత సినిమా 'హంట్' (Hunt) గురించి మాట్లాడుతూ ఇది ఒక మంచి తేదీన విడుదల అవుతోంది అని చెప్పాడు సుధీర్ బాబు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 'పఠాన్' (Pathaan) సినిమా కూడా పెద్ద సినిమా, కానీ జనవరి 26 (January 26 is a good date) మంచి తేదీ అందుకనే 'హంట్' సినిమాని విడుదల చేస్తున్నాం అన్నాడు సుధీర్ బాబు. మంచి రిలీజ్ డేట్ అయితే కనక చిన్న సినిమా, పెద్ద సినిమా ఏది అయినా చూస్తారు. ప్రేక్షకులకు చూడాలనిపించే రోజే విడుదల చేస్తే కచ్చితంగా థియేటర్ కి వస్తారు అని అనుకుంటున్నాను అని చెప్పాడు సుధీర్ బాబు. 'హంట్' సినిమాలో కథానాయిక మీద రొమాన్స్ సన్నివేశాలు వుండవు, పాటలు ఎక్కువ వుండవు, ఇది మామూలుగా వచ్చే సినిమాలు కన్నా కొంచెం కొత్తగా ఉంటుంది అని అనిపిస్తుంది అని చెప్పాడు సుధీర్ బాబు. సినిమా విడుదల రెండు రోజుల ముందు నుండీ తనకి నిదా పట్టదు అనీ, ఎందుకంటే ఎంత బాగా చేసినా కూడా, చాల ఇతర కారణాలు కూడా ఉంటాయి కదా, అందుకని భయంగా కూడా ఉంటుంది అని చెప్పాడు. ఇందులో శ్రీకాంత్ (Srikanth), భరత్ (Premiste fame Bharath) (ప్రేమిస్తే ఫేమ్) కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-01-24T13:09:41+05:30 IST