కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sudheer Babu: అతనితో కొట్టించుకోవడం ఎందుకు, ఇంతకీ ఎవరితో

ABN, First Publish Date - 2023-09-27T16:36:19+05:30

సుధీర్ బాబు సినిమా 'మామ మశ్చీంద్ర' ట్రైలర్ ఈరోజు మహేష్ బాబు తన సాంఘీక మాధ్యమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఒక మీడియా సమావేశంలో, మహేష్ బాబు సినిమాలో మీరు విలన్ గా వస్తే చేస్తారా అని అడిగితే, సుధీర్ బాబు సమాధానం ఏమని ఇచ్చారు అంటే...

Sudheer from Mama Mascheendra film

సుధీర్ బాబు (SudheerBabu) సినిమా 'మామా మశ్చీంద్ర' #MamaMascheendra సినిమా అక్టోబర్ 6 న విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఇందులో సుధీర్ బాబు మూడు పాత్రలో కనపడనున్నాడు, దీనికి హర్షవర్ధన్ (Harshavardhan) దర్శకుడు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఒక ముసలి పాత్రలో కూడా కనపడనున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఇందులో మూడు పాత్రలకు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాసలు మాట్లాడారని చెప్పారు.

మూడు పాత్రలకు మూడు ప్రాంతాల యాసతో డబ్బింగ్ తనే చెప్పాను అని చెప్పాడు సుధీర్ బాబు. సుధీర్ బాబు బావ, సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) ఈ ట్రైలర్ ని సాంఘీక మాధ్యమంలో విడుదల చేశారు. అతనికి ఈ ట్రైలర్ నచ్చుతుందనే అనుకుంటున్నాను అని చెప్పారు. అలాగే మహేష్ బాబు సినిమాలో ఏదైనా ఒక మంచి పాత్రలో కనిపిస్తారా అని అడిగితే, ఈ సినిమా తరువాత చేస్తాను అని చెప్పారు సుధీర్ బాబు. "నేను కొన్ని సినిమాలు చేసి అతని సినిమాలలో చేస్తే బాగుంటుంది, లేకపోతే మొదట్లోనే చేసేస్తే కట్నం తీసుకున్నట్టు ఉంటుంది," అని చెప్పారు సుధీర్ బాబు.

మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు, "ఎందుకండీ ఆయనతో కొట్టించుకోవడం. వద్దు" అని చెప్పారు. మేమిద్దరం ఒకరితో ఒకరు ఇష్టంగా ఉంటాం, కానీ ఇద్దరి మధ్యా ఆ విరోధం అన్నది వద్దు, అందుకే విలన్ గా వద్దు అన్నారు సుధీర్ బాబు.

Updated Date - 2023-09-27T16:36:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!