Sudheer Babu: ‘హరోం హర’.. నా కెరీర్‌ను మ‌లుపు తిప్పుతుంది

ABN , First Publish Date - 2023-12-05T07:59:20+05:30 IST

మామామ‌శ్చీంద్ర త‌ర్వాత సుధీర్ బాబు న‌టిస్తున్న చిత్రం ‘హరోం హర’. పాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌లవ‌గా ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. సుధీర్‌బాబు ఈసారి త‌ప్ప‌నిస‌రిగా భారీ హిట్ కొడుతాడ‌నే న‌మ్మ‌కాన్ని ఇచ్చేలా ఉంది. ఈక్ర‌మంలో టీజ‌ర్ స‌క్సెస్ సెలబ్రేష‌న్స్ నిర్వ‌హించి మీడియాతో చిట్‌చాట్ చేశారు.

Sudheer Babu: ‘హరోం హర’.. నా కెరీర్‌ను మ‌లుపు తిప్పుతుంది
HAROM HARA

మామామ‌శ్చీంద్ర త‌ర్వాత సుధీర్ బాబు (Sudheer Babu ) న‌టిస్తున్న చిత్రం ‘హరోం హర’(Harom Hara). పాన్ ఇండియాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా టీజ‌ర్ ఇటీవ‌ల విడుద‌ల అవ‌గా ప్రేక్ష‌కుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. 7 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్​లో ట్రెండింగ్‌లో నిలిచి సుధీర్‌బాబు ఈసారి త‌ప్ప‌నిస‌రిగా భారీ హిట్ కొడుతాడ‌నే న‌మ్మ‌కాన్ని ఇచ్చింది. ఈక్ర‌మంలో టీజ‌ర్ స‌క్సెస్ సెలబ్రేష‌న్స్ నిర్వ‌హించి మీడియాతో చిట్‌చాట్ చేశారు.

శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమాను గ‌తంలో ‘సెహ‌రి’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన‌ జ్ఞానసాగర్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ‘రెడ్‌, నేల టికెట్టు’ సినిమాల్లో క‌థానాయిక‌గా చేసిన‌ మాళవిక శర్మ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ది. ఈ సందర్భంగా మీడియాతో సుధీర్‌బాబు (Sudheer Babu ) మాట్లాడుతూ ‘బడ్జెట్‌ విషయంలో ఎక్క‌డా త‌గ్గ‌కుండా నిర్మాతలు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నార‌ని, డైరెక్టర్‌ నన్ను స‌రికొత్తగా ప్రజెంట్‌ చేశాడని, నా నట విశ్వ‌రూపం చూస్తార‌ని అన్నారు.


ఈ సినిమా 1989-90ల‌ నేప‌థ్యంలో తెర‌కెక్కిన పిరియాడిక‌ల్ ,ఫిక్ష‌న‌ల్ క‌థ అని, ఇందులో చిత్తూరు కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంద‌ని, అక్క‌డి యాస‌నే ఉప‌యోగించామ‌ని సుధీర్ బాబు(Sudheer Babu ) అన్నారు. ఈ చిత్రం కమర్షియల్‌తో పాటు ఎమోషన్స్‌ కలబోసిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్ అని అన్నారు. ద‌ర్శ‌కుడు న‌న్ను దృష్టిలో పెట్టుక‌కునే ఇ క‌థ‌ను రాసుకున్నాడ‌ని, ప్రేక్ష‌కులు అశ్య‌ర్య‌పోయేలా, నా కెరీర్‌ను ఓ మ‌లుపు తిప్పడంలో ‘హరోం హర’ (Harom Hara) దోహ‌ద ప‌డుతుంద‌ని అన్నారు.

ఇటీవ‌ల ప్ర‌భాస్‌, మ‌మ్ముట్టి, టైగ‌ర్ ష్రాఫ్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌లు అక్కడి భాష‌ల్లో మా ‘హరోం హర’ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేశార‌ని అక్క‌డి నుంచి కూడా టీజ‌ర్‌కు విశేష స్పంద‌న వ‌స్తున్న‌ద‌న్నారు. ఈ క్ర‌మంలో ఓ విలేఖ‌రి ఈ సినిమాలో యాక్ష‌న్‌కు మీరు న్యాయం చేశార‌ని అడ‌గ‌గా నాలాగా యాక్ష‌న్ చేసే న‌టులు లేరంటూ ఓ కామెంట్ చేశారు. ఇక నెక్ట్స్ ‘మా నాన్న సూప‌ర్ హీరో’ అనే ఓ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు తెలిపారు.

Updated Date - 2023-12-05T13:53:29+05:30 IST