Sudhakar Komakula: ‘మెమొరీస్’తో పలకరించిన సుధాకర్ కోమాకుల

ABN , First Publish Date - 2023-11-17T19:44:47+05:30 IST

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కోమాకుల 'మెమొరీస్’ అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. ఈ పాటని శాన్ ఫ్రాన్సిస్కోలో రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించగా అతి త్వరలో విడుద‌ల చేయనున్నారు.

Sudhakar Komakula: ‘మెమొరీస్’తో పలకరించిన సుధాకర్ కోమాకుల
sudhakar

నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కోమాకుల(Sudhakar Komakula) 'మెమొరీస్ (MEMORIES) అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించిన‌ 'మెమొరీస్' వీడియో సాంగ్ అతి త్వరలో విడుద‌ల కానుంది. మంచి ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోన్న‌ నివ్రితి వైబ్స్ (Nivriti Vibes) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో త‌మ‌ యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను శుక్ర‌వారం విడుదల చేశారు.

గతంలో సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్‌గా.. సోని మ్యూజిక్‌లో విడుదలైన షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్‌గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన‌ వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం (Anvesh Bashyam) దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. ఈ పాట వరుణ్ అనే యువకుడి కథని తెలియజేస్తుంద‌ని, తన జర్నీలో ఫీలింగ్స్ లేని స్థితి నుంచి తన గమ్యం ఏమిటో తెలుసుకునే వాడిగా ఎలా మారాడనే అంశంతో పాటు జీవితంలో చోటు చేసుకునే మార్పులని హైలైట్ చేసే విధంగా ఉంటుంద‌న్నారు.


ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ (Arun Chandrashekaran ) కంపోజ్ చేశారు. తెలుగులో రాహుల్ సిప్లిగంజ్, కన్నడలో వాసుకి వైభవ్ పాడార‌ని అన్నారు. ఈ వీడియో సాంగ్ వీక్ష‌కుల‌ను ఇట్టే ఆకట్టుకోవ‌డ‌మే కాక‌ ప్ర‌తి ఒక్కరూ డ్యాన్స్ చేయాలనిపించే విధంగా సింపుల్ హుక్ స్టెప్స్‌ కూడా ఉంటాయ‌న్నారు. సుధాకర్ కోమాకుల నేతృత్వంలో నిర్మించబడిన ఈ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుందన్నారు. తాజాగా విడుద‌ల చేసిన‌ సాంగ్ టీజర్ కు మంచి స్పందన లభిస్తోందన్నారు.

Updated Date - 2023-11-17T19:45:27+05:30 IST