SSMB28 Mass Strike : మహేష్‌ దానికే ఫిక్స్‌... బీడీ త్రీడీలో కనిపిస్తుందా?

ABN , First Publish Date - 2023-05-31T18:16:29+05:30 IST

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ చిత్రం టైటిల్‌ కోసం ప్రేక్షకులు, సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మూడు, నాలుగు రోజులుగా వైరల్‌ అవుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్‌నే ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం సినిమా పేరు రివీల్‌ చేశారు మేకర్స్‌.

SSMB28 Mass Strike : మహేష్‌ దానికే ఫిక్స్‌... బీడీ త్రీడీలో కనిపిస్తుందా?

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ చిత్రం టైటిల్‌ కోసం ప్రేక్షకులు, సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి రకరకాల మాస్‌ లుక్స్‌ విడుదల చేసి సినిమాపై మరింత క్రేజ్‌ పెంచారు మేకర్స్‌. బుధవారం సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన హిట్‌ చిత్రాల్లో ఒకటైన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 4కె వెర్షన్‌లో విడుదల చేశారు. ఇప్పటికే థియేటర్స్‌ దగ్గర అభిమానుల కోలాహలం మొదలైంది. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి వీక్షించడంతోపాటు ఎస్‌ఎస్‌ఎంబీ28 టైటిల్‌ కోసం సూపర్‌స్టార్‌ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మాస్‌ స్ట్రైక్‌ పేరుతో అభిమానులే ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ టైటిల్‌ను విడుదల చేశారు. మూడు, నాలుగు రోజులుగా వైరల్‌ అవుతున్న ‘గుంటూరు కారం’ టైటిల్‌నే ఖరారు చేశారు. బుధవారం సాయంత్రం సినిమా పేరు రివీల్‌ చేశారు మేకర్స్‌.

సన్నకర్ర.. సవ్వాదెబ్బ బొడ్డు రాయి.... దవడ అబ్బ.... వుయ్‌..

ఏ సర్రసర్ర శూలం.. సుర్రంటాడి కారం.. ఇది ఎర్రెతించే బేరం.. అంటూ సాగే లిరిక్‌..

‘ఏంది అట్టా చూస్తున్నావ్‌.. బీడీ త్రీడీలో కనిపిస్తుందా’?

అంటూ మహేశ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటున్నాయి. తలపాగా చుట్టుకుని ఉన్న మహేశ్‌ మాస్‌ లుక్‌ ఫ్యాన్స్‌ని అలరించేలా ఉంది.

మహేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రమిది. హరికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీలా నాయికలు.

Updated Date - 2023-05-31T18:41:31+05:30 IST