SSMB28: సూపర్‌ ఫ్యాన్‌కి సర్‌ప్రైజ్‌.. ఆ రోజే!

ABN , First Publish Date - 2023-05-26T17:03:42+05:30 IST

సూపర్‌స్టార్‌ (Maheshbabu)మహేశ్‌ అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు.. తాజాగా ఆయన హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ (SSMB28)చిత్రం అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

SSMB28: సూపర్‌ ఫ్యాన్‌కి సర్‌ప్రైజ్‌.. ఆ రోజే!

సూపర్‌స్టార్‌ (Maheshbabu)మహేశ్‌ అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు.. తాజాగా ఆయన హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ (SSMB28)చిత్రం అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సందర్భం రానే వచ్చింది. ఈ చిత్రం టైటిల్‌ను సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా ఈ నెల 31న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ విడుదల చేసి ఈ విషయాన్ని తెలియజేసింది. అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్‌ ఈ వార్తతో కాస్త కూల్‌ అయ్యారు. (SSMB28 Title launch)

హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ (Trivkram)దర్శకుడు. పూజాహెగ్డే(pooja hegde), శ్రీలీలా కథానాయికలు. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-05-26T17:05:38+05:30 IST