SSMB28: ఓటీటీ రైట్స్‌కు భారీ ధర!

ABN , First Publish Date - 2023-02-02T17:11:01+05:30 IST

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రంగా రాబోతుంది. ఎస్‌ఎస్‌ఎంబీ 28గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబో సెట్‌ కావడంతో కచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ హ్యాట్రిక్‌ అవుతుందనే అభిమానులు భావిస్తున్నారు.

SSMB28: ఓటీటీ రైట్స్‌కు భారీ ధర!

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌(Maheshbabu) - త్రివిక్రమ్‌(Triikram) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో చిత్రంగా రాబోతుంది. ఎస్‌ఎస్‌ఎంబీ 28గా (SSMB28) రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 11 ఏళ్ల తర్వాత ఈ కాంబో సెట్‌ కావడంతో కచ్చితంగా ఈ ప్రాజెక్ట్‌ హ్యాట్రిక్‌ అవుతుందనే అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌ మీదుందీ చిత్రం. అయితే సెట్‌ మీదుండగానే ఈ చిత్రం బిజినెస్‌ గురించి వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. (Ssmb 28 OTT rights), (SSMB28 Hatrick)

ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌కు భారీ ధర పలికిందనే వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ దీని డిజిటల్‌ రైట్స్‌ సొంతం చేసుకుందని కొన్ని రోజుల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ విడుదలయ్యే అన్ని భాషలకు కలిపి రూ.80 కోట్ల (80 Crores for OTT) రూపాయలు పలికినట్టు సమాచారం. థియేట్రికల్‌ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలో చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సదరు సంస్థ వెల్లడించింది. నైజాం రైట్స్‌ దిల్‌రాజు. రూ. 50 కోట్లకు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఏషియన్‌ సంస్థ రూ.48 కోట్లు ఆఫర్‌ చేసిందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (80 Crores OTT offer for SSMB28)

Updated Date - 2023-02-02T17:11:52+05:30 IST