SS Rajamouli: ప్రపంచానికి చెప్పాల్సిన కథ... అంత ఈజీ కాదు!

ABN , First Publish Date - 2023-05-10T10:49:27+05:30 IST

రాజమౌళి (SS Rajamouli) టాలీవుడ్‌కు ఓ బ్రాండ్‌. ఆయన సినిమా అంటే అంచనాలు, దాని ఫలితం ఎలా ఉంటుందో తెలిసిందే! తెలుగు చిత్ర పరిశ్రమలో ఫెయిల్యూర్‌ తెలియని దర్శకుడు ఆయన.

SS Rajamouli: ప్రపంచానికి చెప్పాల్సిన కథ... అంత ఈజీ కాదు!

రాజమౌళి (SS Rajamouli) టాలీవుడ్‌కు ఓ బ్రాండ్‌. ఆయన సినిమా అంటే అంచనాలు, దాని ఫలితం ఎలా ఉంటుందో తెలిసిందే! తెలుగు చిత్ర పరిశ్రమలో ఫెయిల్యూర్‌ తెలియని దర్శకుడు ఆయన. ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఆస్కార్‌ స్థాయికి తీసుకెళ్లి... తొలిసారి తెలుగు సినిమాకు ఆస్కార్‌ వైభవం తీసుకొచ్చిన ఘనతను దక్కించుకున్నారు. జక్కన్న నుంచి వచ్చిన ప్రతి సినిమా ఆయన కలల ప్రాజెక్టే. ఎందుకంటే ఆయన తీసే ప్రతి సినిమాను డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గానే భావిస్తారు. ప్రస్తుతం ఆయన మదిలో మరో డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంది. అదే భారతీయ ఇతిహాసగాథ ‘మహాభారతం’(Mahabharatham). ఆ సినిమాను భారీ స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా తీయాలన్నది ఆయన కల. తాజాగా ఆ చిత్రం గురించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ‘మహాభారతాన్ని’ పది భాగాలుగా తీసే ఆలోచనలో ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. (Update on Maha bharatham)

తాజాగా రాజమౌళి ఓ ప్రైవేట్‌ ప్రొగ్రాంలో పాల్గొన్నారు. ఆ వేదికపై ఓ వ్యక్తి రాజమౌళిని ప్రశ్నించారు. గతంలో వచ్చిన అద్భుతమైన దృశ్య కావ్యం ‘మహాభారతం’ టీవీ మాధ్యమంలో 266 ఎపిసోడ్స్‌గా ప్రసారమైంది. మీరు కూడా ‘మహాభారతం’ తీస్తానని’ అన్నారు. ‘మీరు తీస్తే ఎన్ని భాగాలుగా తీస్తారు’ అని ప్రశ్నించారు. దానికి రాజమౌళి సమాధానమిస్తూ.. ‘‘ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఒకవేళ ‘మహాభారతం’ తీయాలంటే దానికి సంబంధించి భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాలు చదవాలి. దానికి ఏడాదిపైనే సమయం పట్టొచ్చు. అప్పటికీ ఒక్క అక్షరం కూడా పేపర్‌పై పెట్టలేకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్టు. ‘మహాభారతం’ (Maha bharatam in 10 parts) తీస్తే పది భాగాలుగా తీయాల్సి వస్తుందేమోనని నేను ఊహిస్తున్నా. అయితే, ఎన్ని భాగాలుగా అయితే బావుంటుందో కచ్చితంగా చెప్పలేను’’

అని అన్నారు

ఇదే విషయం మీద గతంలోనూ రాజమౌళి ప్రస్తావించారు. ‘మహాభారతం’ అనేది మహా సముద్రం. పెద్ద ప్రాజెక్ట్‌గా చేయాలి. భారతీయ కథను ప్రపంచానికి చెప్పాలి అంటే అంత ఈజీగా కాదు. ఊహించినంత సులభం కాదు. అయితే ఇది నా చిరకాల ప్రాజెక్ట్‌. ఆ సముద్రంలో అడుగు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. అంతకన్నా ముందు నాలుగైదు సినిమాలు తీస్తానేమో’’ అని అన్నారు.

రాజమౌళి సినిమాకు సక్సెస్‌ రేట్‌ ఎంత భారీగా ఉంటుందో.. సినిమా తెరకెక్కించడమూ అంతే భారీగా ఉంటుంది. ఇక సెట్‌ మీదకు వెళ్లగా పూర్తవ్వడానికి రెండేళ్లు పట్టవచ్చు. లేదా ఐదేళ్ల వరకూ జరపవచ్చు. మరి మహాభారతం లాంటి సినిమాను పది భాగాలుగా తీయాలంటే రాజమౌళి ఎన్నేళ్లు పడుతుందో చూడాలి. ఆర్‌ఆర్‌ఆర్‌తో భారీ విజయం అందకున్న రాజమౌళి తదుపరి మహేశ్‌తో (Maheshbabu)ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29) సినిమాతో బిజీ కానున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ చిత్రం సెట్‌ మీదకెళ్లే అవకాశం ఉంది.

Updated Date - 2023-05-10T10:50:30+05:30 IST