SS Rajamouli: యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె, ధమ్ ధమ్ చెయ్యొద్దు

ABN , First Publish Date - 2023-05-29T15:41:26+05:30 IST

చిన్న సినిమాలని ఎంకరేజ్ చేసే రాజమౌళి ఈసారి ఇంకో చిన్న సినిమాని ఎంకరేజ్ చేసాడు. థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసి చాలా కాలం అయింది, ఇప్పుడు ఇంకో చిన్న సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాను అని చెప్పాడు రాజమౌళి.

SS Rajamouli: యూత్ ని ఎంకరేజ్ చెయ్యాలె, ధమ్ ధమ్ చెయ్యొద్దు
SS Rajamouli

కొత్త కుర్రాళ్లంతా కలిసి చేసిన సినిమా 'మేమ్ ఫేమస్' (MemFamous) గతవారం విడుదల అయింది. సుమంత్ ప్రభాస్ (SumanthPrabhas) దీనికి రచన, దర్శకుడు, అలాగే ఇందులో కథానాయకుడిగా కూడా నటించాడు. ఈ సినిమాని ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) చూసి ఎంతో మెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక, క్రిటిక్స్ అంతగా నచ్చలేదు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళు మాత్రం చాలా బావున్నాయని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

అయితే ఈ సినిమాని ఇంకో ముఖ్యమైన వ్యక్తి చూసి గొప్ప కితాబునిచ్చారు. అతను మరెవరో కాదు, భారతదేశంలో అగ్ర దర్శకుడు అయిన ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ సినిమాని చూసి ఒక ట్వీట్ చేసాడు కూడా. ఈమధ్య కాలం లో ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా ఇది అని అన్నారు రాజమౌళి. అలాగే దర్శకుడు సుమంత్ (SumanthPrabhas) ని ప్రత్యేకంగా పొగిడారు కూడా. అతనికి ఎంతో భవిష్యత్తు వుంది నటుడిగా, దర్శకుడిగా అని చెప్పారు రాజమౌళి.

memfamous1.jpg

ఇంకా అన్ని పాత్రలు చాలా బాగా చేసారు చాలా సహజంగా నటించారు అని చెప్పారు. రాజమౌళి ప్రత్యేకంగా అంజి మామ పాత్ర బాగా నచ్చింది అని చెప్పారు. అలాగే ఈ సినిమాని అందరినీ చూడమని కూడా చెప్పారు. యూత్ ని ఎంకరేజ్ చెయ్యండి, అంతే గానీ ధమ్ ధమ్ చెయ్యొద్దు అని అన్నారు రాజమౌళి.

Updated Date - 2023-05-29T15:41:26+05:30 IST