Rajamouli - Shah Rukh Khan : రాజమౌళి ట్వీట్‌కు.. షారుఖ్‌ కౌంటర్‌ ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-09-08T18:23:15+05:30 IST

"చాలాకాలం తర్వాత వెంటవెంటనే రెండు చిత్రాలు చూశాను. రెండు అద్భుతంగా ఉన్నాయి’’ అంటూ దర్శకధీరుడు రాజమాళి (Rajamouli) ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’, ‘జవాన్‌’ (Jawan) చిత్రాలను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. సక్సెస్‌ సాధించిన ఈ చిత్ర బృందాలను అభినందించారు.

Rajamouli - Shah Rukh Khan :  రాజమౌళి ట్వీట్‌కు.. షారుఖ్‌ కౌంటర్‌ ఏంటంటే..!

"చాలాకాలం తర్వాత వెంటవెంటనే రెండు చిత్రాలు చూశాను. రెండు అద్భుతంగా ఉన్నాయి’’ అంటూ దర్శకధీరుడు రాజమాళి (Rajamouli) ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పోలిశెట్టి’, ‘జవాన్‌’ (Jawan) చిత్రాలను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. సక్సెస్‌ సాధించిన ఈ చిత్ర బృందాలను అభినందించారు. ఈ మేరకు ‘జవాన్‌’ చిత్రాన్ని ఉద్దేశించి బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌పై(Shah rukh Khan) ప్రశంసల వర్షం కురిపించారు. గురువారం విడుదలైన ‘జవాన్‌’ చిత్రాన్ని వీక్షించిన ఆయన సినిమా సక్సెస్‌ పట్ల చిత్రబృందాన్ని అభినందించారు. ‘ఓపెనింగ్స్‌తోనే బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టడం ఆయనకే సాధ్యం. అందుకే షారుఖ్‌ఖాన్‌ బాక్సాఫీస్‌ బాద్‌షా అయ్యారు’ అని కొనియాడారు. ఉత్తరాదిలో కూడా సక్సెస్‌ పరంపర కొనసాగుతుంది దర్శకుడు అట్లీకి, ఇతర చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే ‘మిస్‌ శెట్టి... మిస్టర్‌ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) చిత్రాన్ని ఉద్దేశించి కూడా ఆయన ట్వీట్‌ చేశారు. ‘స్వీటీ ఎప్పటిలాగే అందంగా మెరిసిపోయింది. నవీన్‌ పోలిశెట్టి తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు. సున్నితమైన కథను.. దారి తప్పకుండా చక్కని హాస్యాన్ని జోడించి తెరకెక్కించిన దర్శకుడు మహేశ్‌కు, ఇతర చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అనుష్క, నవీన్‌ పోలిశెట్టి కీలక పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి మహేశ్‌ పి దర్శకుడు. యు.వి.క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది.

F5f9CnNbcAARRdG.jpg

రాజమౌళి ట్వీట్‌కు షారుఖ్‌ఖాన్‌ స్పందించారు. ‘‘చాలాచాలా థ్యాంక్స్‌ సర్‌. సినిమాను తెరకెక్కించే విషయంలో మీరు ఉపయోగించే క్రియేటివ్‌ ఇన్‌పుట్స్‌ మేమంతా నేర్చుకున్నాం. మీకు కుదిరినప్పుడు సినిమా చూడండి. తర్వాత నాకు కాల్‌ చేసి ‘నేను కూడా మాస్‌ హీరోనే అని చెప్పండి. హా..హా..హా.. ప్రేమతో’’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-09-08T18:26:01+05:30 IST