SS Rajamouli: ఒక వినూత్న సినిమాలో భాగం అవుతున్న అగ్ర దర్శకుడు

ABN , First Publish Date - 2023-09-19T10:38:11+05:30 IST

భారత దేశంలో అగ్ర దర్శకుల్లో ఒకరు అయిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ఇంకొక వినూత్నమైన సినిమాలో భాగం కానున్నారు. ఆ సినిమా కథ వినగానే రాజమౌలి ఎంతో భావోద్వేగానికి గురయ్యాను అని చెప్పారు, ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా...

SS Rajamouli: ఒక వినూత్న సినిమాలో భాగం అవుతున్న అగ్ర దర్శకుడు
SS Rajamouli

ఎస్ఎస్ రాజమౌళి (SSRajamouli) పేరు తెలియని వారు ఉండరేమో, ఎందుకంటే ప్రపంచం అంతటా అతని పేరు మాగుతోంది. అతని సినిమా 'ఆర్ఆర్ఆర్' #RRR ఆస్కార్ అవార్డుల (OscarAward) వరకు వెళ్ళింది, అందులో పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అందుకని రాజమౌళి పేరు తెలియని వారుండరు. ఇప్పుడు ఆ రాజమౌళి ఇంకొక వినూత్నమైన సినిమాలో భాగం అవుతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా, ఒక బయోపిక్.

బయోపిక్ అంటే ఏదైనా ఒక వ్యక్తి, లేదా సంఘంటన గురించి తీసిన సినిమా కాదు, ఏకంగా ఇండియన్ సినిమా గురించి ఈ బయోపిక్. ఈ సినిమాకి ప్రెజంటర్ గా రాజమౌళి ఉంటే, ఈ సినిమాకి నిర్మాతల్లో ఒకరు రాజమౌలి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ. (SSKartbhikeya) ఈ సినిమాకి దర్శకుడు నితిన్ కక్కర్ (NitinKakkar).

sskarthikeya.jpg

ఇండియన్ సినిమా చరిత్రలో చాలామంది చాలా బియోపిక్స్ తీసి విడుదల చేశారు. కానీ ఈ బయోపిక్ చాలా వైవిధ్యంతో కూడుకున్నది, అదే ఇండియన్ సినిమా బయోపిక్, 'మేడ్ ఇన్ ఇండియా' (MadeInIndia) అనే టైటిల్ తో వస్తోంది అనే వీడియో ఈరోజు తన సాంఘీక మాధ్యమం లో విడుదల చేశారు రాజమౌళి. ఈ సినిమాకి నిర్మాత వరుణ్ గుప్త (VarunGupta), ఎస్ఎస్ కార్తికేయ. "మొదట ఈ కథ గురించి విన్నప్పుడు నేను చాలా భావోద్వేగాయానికి గురయ్యాను, నన్ను బాగా కదిలించింది. ఇలాంటి బయోపిక్‌ని రూపొందించడం చాలా కష్టం, కానీ భారతీయ సినిమా పితామహుడు గురించి ఆలోచించడం మరింత సవాలుతో కూడుకున్నది," అని రాజమౌళి ట్వీట్ చేశారు.

Updated Date - 2023-09-19T10:38:11+05:30 IST