OG: అయిదు నిముషాల్లో శ్రీయ రెడ్డి ఒకే చేసిన పవర్ ఫుల్ క్యారక్టర్

ABN , First Publish Date - 2023-06-13T14:31:57+05:30 IST

'పొగరు' లాంటి సినిమాలో విలన్ గా వేసి అందరినీ మెప్పించిన శ్రీయ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ సినిమా 'ఓజి' లో ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

OG: అయిదు నిముషాల్లో శ్రీయ రెడ్డి ఒకే చేసిన పవర్ ఫుల్ క్యారక్టర్
Sriya Reddy

పవన్ కళ్యాణ్ (PawanKalyan) నటిస్తున్న సినిమా 'ఓజి' #OG లో ఇప్పుడు ఇంకొక నటి చేరింది. సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (PriyankaMohan) కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో 'పొగరు' #Pogaru సినిమాలో విలన్ గా వేసిన శ్రీయ రెడ్డి (SriyaReddy) ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.

pawankalyanogsets1.jpg

ఈ విషయాన్ని అధికార ప్రకటన ద్వారా చిత్ర నిర్వాహకులు తెలిపితే, శ్రీయ రెడ్డి తన సాంఘీక మాధ్యమం దవారా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఆమె ఒక నోట్ ద్వారా ఈ చిత్రాల్లోని తన పాత్ర గురించి చెపుతూ దర్శకుడు సుజీత్ కథ చెప్పగానే, అయిదు నిముషాల్లో ఈ సినిమాని ఒకే చేసినట్టుగా చెప్పింది. అది అంత పవర్ ఫుల్ పాత్ర అని చెప్పుకొచ్చింది.

sriyareddy1.jpg

అలాగే ఈ సినిమాలో అందరితో చెయ్యడం చాలా సంతోషం అంటూ చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఒక అద్భుత వ్యక్తి అని అతను రిసీవ్ చేసుకునే పద్దతి, అతను సెట్ మీదే వున్నప్పుడు వుండే ఒకరకమైన వాతావరణం బాగుంటుందని చెప్పింది. అలాగే సుజీత్ ఒక బలమైన కథ రాసాడని చెప్పింది శ్రీయ రెడ్డి. రవి కె చంద్రన్ (RaviKChandran), ప్రకాష్ రాజ్ (PrakashRaj), నిర్మాత దానయ్య అందరికీ పేరు పేరునా వాళ్ళ చెప్పింది.

శ్రీయ రెడ్డి చెప్పాలంటే తెలుగు అమ్మాయే, 'అప్పడప్పుడు', 'అమ్మచెప్పింది' తెలుగు సినిమాల్లో నటించింది. ప్రభాస్ నటిస్తున్న 'సాలార్' లో కూడా ఒక కీలక పాత్ర చేస్తోంది. అలాగే 'పొగరు' అనే సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది.

Updated Date - 2023-06-13T14:31:57+05:30 IST