హీరోయిన్‌గా శ్రీదేవి రెండో కూతురు

ABN , First Publish Date - 2023-09-16T00:36:52+05:30 IST

అతిలోకసుందరి శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ చాన్నాళ్ల క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.....

హీరోయిన్‌గా శ్రీదేవి రెండో కూతురు

అతిలోకసుందరి శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ చాన్నాళ్ల క్రితమే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ‘దేవర’ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పుడు రెండో కూతురు ఖుషి వంతు వచ్చింది. అమ్మ, అక్కలా తను కూడా ప్రేక్షకులను అలరించడానికి రంగ ప్రవేశం చేయనుంది. శ్రీదేవి తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు పొందిన తర్వాతే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, అగ్ర నాయికగా ఎదిగారు. ఇప్పుడు ఖుషి కూడా తల్లి బాటనే అనుసరిస్తూ మొదట తమిళ చిత్రం ద్వారా కెరీర్‌ను ప్రారంభించనుంది. ఆ చిత్రం ఏమిటి, హీరో ఎవరు అనే వివరాలను ఆమె తండ్రి, నిర్మాత బోనీకపూర్‌ త్వరలో ప్రకటించనున్నారు. నిజం చెప్పాలంటే ఖుషికి ఇదే తొలి సినిమా కాదు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ హిందీ చిత్రంలో నటించింది. కానీ అది ఇంకా స్ట్రీమింగ్‌ కాలేదు. సౌత్‌లో నిరూపించుకున్న తర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాలన్నది ఖుషి ప్లాన్‌. ఈ అక్కా చెల్లెళ్లు శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated Date - 2023-09-16T00:36:52+05:30 IST