Adikeshava: శ్రీలీల, వైష్ణవ తేజ్ సినిమా విడుదల వాయిదా, ఇప్పుడు నవంబర్ 24 న విడుదల

ABN , First Publish Date - 2023-11-01T12:31:03+05:30 IST

వరల్డ్ క్రికెట్ కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇండియా ఆడే మ్యాచ్ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్స్ కి రావటం లేదని, అందుకని 'ఆదికేశవ' సినిమాని నవంబర్ 10 నుండి 24కి వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు ఆ సినిమా నిర్మాత నాగవంశి.

Adikeshava: శ్రీలీల, వైష్ణవ తేజ్ సినిమా విడుదల వాయిదా, ఇప్పుడు నవంబర్ 24 న విడుదల
Sreeleela and Vaishnav Tej from Aadikeshava

వైష్ణవ తేజ్ (VaishnavTej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ఆదికేశవ' #Adikeshav సినిమా కూడా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కావాల్సి వుంది, కానీ ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీ (SuryadevaraNagaVamsi) ఈ సినిమాని నవంబర్ 24న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమాని సితార ఎంటర్ టైనమెంట్స్ (SitharaEntertainments) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రచారాలు కూడా ప్రారంభించారు, కానీ ఇప్పుడు విడుదల వాయిదా వేశారు.

Aadikeshava.jpg

ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ #CricketWorldCup23 లు జరుగుతున్న దృష్ట్యా అందులోకి ఇండియా మ్యాచ్ ఆడే రోజు సినిమా థియేటర్స్ లో కలెక్షన్స్ బాగా పడిపోతున్నాయి. ఎందుకంటే ఆ విషయం నాకు 'మాడ్' #MAD, 'లియో' #Leo సినిమాలప్పుడు తెలిసింది. ఎందుకంటే ఇండియా మ్యాచ్ లు జరిగినప్పుడు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. అందుకనే ఈ 'ఆదికేశవ' #Adikeshava సినిమా కూడా విడుదలని నవంబర్ 24 కి వాయిదా వేస్తున్నట్టు చెప్పారు నాగ వంశి.

ఈ విషయం డిస్ట్రిబ్యూటర్స్, ఇతర సభ్యులతో కూడా మాట్లాడి పోస్టుపోన్ చేసినట్టు చెప్పారు. అలాగే కేవలం ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ లు వలన ప్రేక్షకులు థియేటర్స్ రాకపోవటం వలన ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే దీపావళికి (Deepavali) సల్మాన్ ఖాన్ (SalmanKhan) 'టైగర్ 3' (Tiger3) కూడా వస్తోంది అని, రెవిన్యూ షేర్ చేసుకోవటం ఇష్టం లేదని అది కూడా ఒక కారణం అని ప్రకటించారు.

Updated Date - 2023-11-01T12:31:03+05:30 IST