Sreeleela : నెలకో సినిమా... శ్రీలీల నామ సంవత్సరం అంటున్నారు.

ABN , First Publish Date - 2023-08-29T18:58:54+05:30 IST

ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత. సినిమా పరిశ్రమలో కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్‌ల విషయంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. తెలుగువాళ్లు మరో ఇండస్ట్రీకి వెళ్లినా, అక్కడివాళ్లు ఇక్కడికి వచ్చి సక్సెస్‌ అయినా ఎక్కువగా వినిపించే మాట ఇది. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల విషయంలో ఇదే సామెత వినిపిస్తోంది. అయితే అది రివర్స్‌లో ‘రచ్చ గెలిచి.. ఇంట గెలుస్తుందని శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Sreeleela : నెలకో సినిమా... శ్రీలీల నామ సంవత్సరం అంటున్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత. సినిమా పరిశ్రమలో కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్‌ల విషయంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. తెలుగువాళ్లు మరో ఇండస్ట్రీకి వెళ్లినా, అక్కడివాళ్లు ఇక్కడికి వచ్చి సక్సెస్‌ అయినా ఎక్కువగా వినిపించే మాట ఇది. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela) విషయంలో ఇదే సామెత వినిపిస్తోంది. అయితే అది రివర్స్‌లో ‘రచ్చ గెలిచి.. ఇంట గెలుస్తుందని శ్రీలీలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కన్నడలో పలు చిత్రాలతో విజయం అందుకున్న శ్రీలీల ‘పెళ్లి సందడి’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా హీరోయిన్‌గా శ్రీలీల మాత్రం ఫుల్‌ మార్స్‌ స్కోర్‌ చేసింది. తనదైన శైలి డాన్స్‌తో అదరగొట్టింది. అక్కడి నుంచి అవకాశాలు వరుస కట్టాయి. ఇప్పుడామె టాలీవుడ్‌కు లక్కీ హీరోయిన్‌గా మారింది. అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొంటుంది. ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ సరసన హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె ఇప్పుడు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నుంచి, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌, నితిన్‌, విజయ్‌ దేవరకొండ పంజా వైష్ణవ్‌ తేజ్‌ ఇలా స్టార్‌లతోనే కాకుండ నేటితరం హీరోలతో కూడా స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంటుంది. గత ఏడాది డిసెంబర్‌లో రవితేజ ‘ధమాకా’ చిత్రంతో మెప్పించిన ఆమె ఈ ఏడాది వినాయక చవితి నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు.. ప్రతి పండక్కి ఆమె నటించిన ఓ సినిమా, నెలకో సినిమాతో సందడి చేయడానికి రెడీ అయిపోయింది. (Tollywood Trending Heroine)

Skanda.jpg

వినాయక చవితితో షురూ...(Skanda)

రామ్‌ పోతినేని సరసర శ్రీలీల నటించిన చిత్రం ‘స్కంద’. మాస్‌, యాక్షన్‌ చిత్రాల హిట్‌ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రమిది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.

5022961c0e.jpg

భగవంత్‌ కేసరితో.. దసరా...(Bhagavanth kesari)

వినాయక చవితి పూర్తి కాగానే మరో సినిమాతో సిద్ధమైపోయింది శ్రీలీల. విజయ దశమికి బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి’తో అక్టోబర్‌ 19న థియేటర్లలోకి రానున్నారు ఈ చిత్రంలో బాలకృష్ణ, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించారు. శ్రీ లీల కీలక పాత్రలో కనిపిస్తారు. అయితే ఆమె పాత్ర ఏంటన్నది సస్పెన్స్‌గా ఉంచారు దర్శకుడు. ఇందులో ఆమె హీరోయిన్‌ కాకపోయినా మాంచి డాన్స్‌ నంబర్‌ చేశారని టాక్‌. అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు.

Adkesava.jpg

నవంబర్‌లో ‘ఆదికేశవ’ (Adi Kesava)

పంజా వైష్ణవ్‌ తేజ్‌ నటించిన ‘ఆది కేశవ’ చిత్రం దీపావళి షెడ్యూల్‌లో లేదు. ఆగస్ట్‌లోనే విడుదల కావలసింది. కానీ పెద్ద చిత్రాలు ఉండడంతో కాస్త వెనక్కి వెళ్లింది. ఇప్పుడు దీపావళి బరిలో ‘ఆదికేశవ’ నిలిచింది. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

extra.jpg

క్రిస్మస్‌కు ‘ఎక్స్‌ట్రా’ (Extra)

క్రిస్మస్‌ సీజన్‌ను కూడా శ్రీలీల మిస్‌ కాలేదు. నితిన్‌తో కలిసి నటించిన ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్‌’ కిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పా లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. హారిస్‌ జయరాజ్‌ చక్కని మెలోడీ అందించారు. ‘కిక్‌’ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ‘కిక్‌’ తర్వాతలో ఈ చిత్రం ఉండబోతోందని యూనిట్‌ చెబుతోంది.

Sri-leela-Gk.jpg

సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో.. (Guntur Karam)

2023 సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు వరుస సిినిమాలతో సందడి చేయనున్న ఈ అమ్మడు వచ్చే ఏడాది ప్రారంభం నుంచే సందడికి దిగడానికి సిద్ధమైంది. ఈ చిత్రాలన్ని ఒక ఎత్తు అయితే.. సంక్రాంతి విడుదల మరో ఎత్తు. మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’లో శ్రీలీల ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొదట ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజా హెగ్డే అనుకున్నారు. పలు కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో రెండో హీరోయిన్‌గా ఉన్న శ్రీలీల మెయిన్‌ హీరోయిన్‌ అయింది.

Srileela Bhagat sing.jpg

అయితే ఈ ఐదు చిత్రాలే కాదు.. పవన్‌ కళ్యాణ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, (Ustaad Bhagath singh) విజయ్‌ దేవరకొండతో ఓ సినిమాలోనూ శ్రీలీల నటిస్తోంది. అంతే కాదు పలు కథలు చర్చల్లో ఉన్నాయి. అంటే రాబోయే ఏడాది డైరీ కూడా ఫుల్‌ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మాత్రం శ్రీలీలకు దక్కిన అవకాశం మరే హీరోయిన్‌కు దక్కలేదు. ఇలా నెలకో రిలీజ్‌ ప్లానింగ్‌ లేదు. ఒక హీరోయిన్‌ నటించిన ఐదు చిత్రాలు నెలకో సినిమా చొప్పున విడుదల కావడం అనేది ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్‌కు జరగలేదు. దీన్ని బట్టి చూస్తే శ్రీలీల ఎంత లక్కీనో తెలుస్తోంది. ఇది శోభకృత్‌ నామ సంవత్సరమా లేక శ్రీలీల నామ సంవత్సరమా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Updated Date - 2023-08-29T18:58:54+05:30 IST