Sreeleela: లక్‌ బావుంది.. క్రేజీ కాంబో సెట్ అయింది

ABN , First Publish Date - 2023-03-02T15:34:16+05:30 IST

పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయైున శ్రీలీల ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల ‘ధమాకా’తో సూపర్‌హిట్‌ అందుకున్న ఈ గ్లామర్‌ బ్యూటీ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది.

Sreeleela: లక్‌ బావుంది.. క్రేజీ కాంబో సెట్  అయింది

పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయైున శ్రీలీల (Shee Leela)ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల ‘ధమాకా’(Dhamaka)తో సూపర్‌హిట్‌ అందుకున్న ఈ గ్లామర్‌ బ్యూటీ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. సీనియర్‌ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ ఆమెతో జత కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో శ్రీలీలకు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే మహేశ్‌ బాబు(mahesh babu), రామ్‌ చిత్రాలో నటిస్తోంది. వైష్ణవ్‌ తేజ్‌, నవీన్‌ పొలిశెట్టి చిత్రాల్లో అవకాశం అందుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరో క్రేజీ హీరో సరసన అవకాశం అందుకున్న సమాచారం. విజయ్‌ దేవరకొండకు (Vijay devarakonda) జోడీగా శ్రీలీల నటించనుందట. ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే! ఆ చిత్రంలో విజయ్‌ సరసన శ్రీలీల నటించనుందని తెలిసింది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. Vijay Devarakonda pair up with Sree leela)

5.jpg

Updated Date - 2023-03-02T15:34:17+05:30 IST