Spider Man Hero: ఆర్‌ఆర్‌ఆర్‌ చూశా... మళ్లీ రావాలనుంది!

ABN, First Publish Date - 2023-06-05T17:51:42+05:30

"ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాదు రాజమౌళి(SS rajamouli). ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోట్ల కొద్ది వసూళ్లు సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకొంది. ‘స్పైడర్‌ మ్యాన్‌’ హీరో టామ్‌ హాలండ్‌ (Spider Man HeroTom Holland) కూడా ఈ చిత్రం గురించి స్పందించారు.

Spider Man Hero: ఆర్‌ఆర్‌ఆర్‌ చూశా... మళ్లీ రావాలనుంది!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

"ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR)తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాదు రాజమౌళి(SS rajamouli). ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోట్ల కొద్ది వసూళ్లు సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకొంది. తెలుగు సినిమాకు తొలి ఆస్కార్‌ తీసుకొచ్చిన ఘనత సాధించారు జక్కన్న. ఇప్పటికే ఈ చిత్రం గురించి హాలీవుడ్స్‌ స్టార్స్‌తో ఎంతోమంది మాట్లాడారు. తాజాగా ‘స్పైడర్‌ మ్యాన్‌’ హీరో టామ్‌ హాలండ్‌ (Spider Man HeroTom Holland) కూడా ఈ చిత్రం గురించి స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. (Spider man fame)

ఇటీవల ముంబై వచ్చిన టామ్‌ హాలండ్‌ (Tom Holland) మూడు రోజులు ఇండియాలో ఉన్నారు. భారత్‌ పర్యటన గురించి మాట్లాడుతూ అందులోనే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ‘‘ఇండియా టూర్‌ నాకెన్నో మంచి జ్ఞాపకాలనిచ్చింది. జీవితంలో మరచిపోలేని టూర్‌ ఇది. మళ్లీ భారత్‌కు వెళ్లాలనుంది. ఈ మూడు రోజుల్లో ఎంతోమంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సమయం అద్భుతంగా గడిచింది. అలాగే ఈ మధ్యనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశాను. ఆ సినిమా నాకెంతో నచ్చింది’’ అని చెప్పారు ఆ వీడియోను రాజమౌళి, ఆర్‌ఆర్‌ఆర్‌ ఫ్యాన్‌ తెగ షేర్‌ చేస్తున్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి మహేశ్‌తో సినిమా కమిట్‌ అయ్యారు. ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29) వర్కింగ్‌ టైటిల్‌తో ఫారెస్ట్‌ అడ్వెంచర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ తర్వాత ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - 2023-06-05T17:51:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!