Adipurush: ఆంజనేయుడికి ప్రత్యేక సీటు

ABN , First Publish Date - 2023-06-06T15:08:08+05:30 IST

ఆదిపురుష్‌’ (Adi purush) సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా మొదలు పెట్టింది చిత్ర బృందం. ఒక్కో పోస్టర్‌తో ఆసక్తి రేపుతున్న చిత్ర బృందం ప్రమోషన్‌ విషయంలో మరో కొత్త ఆలోచన చేసింది. సినిమా విడుదలయ్యాక థియేటర్స్‌లోని టికెట్లు అన్నీ అమ్మినా.. ఒక్క సీటు మాత్రం ఖాళీగా ఉంచుతారట(Prabhas).

Adipurush: ఆంజనేయుడికి ప్రత్యేక సీటు

‘ఆదిపురుష్‌’ (Adi purush) సినిమా ప్రమోషన్‌ను వినూత్నంగా మొదలు పెట్టింది చిత్ర బృందం. ఒక్కో పోస్టర్‌తో ఆసక్తి రేపుతున్న చిత్ర బృందం ప్రమోషన్‌ విషయంలో మరో కొత్త ఆలోచన చేసింది. సినిమా విడుదలయ్యాక థియేటర్స్‌లోని టికెట్లు అన్నీ అమ్మినా.. ఒక్క సీటు మాత్రం ఖాళీగా ఉంచుతారట(Prabhas). ఆ ఒక్క టికెట్‌ ఎవరికీ అమ్మరు. ఎందుకంటే అది హనుమంతుడి కోసం. (For Hanuman)

రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటుకి హనుమంతుడు విచ్చేస్తాడనేది నమ్మకం. ఆ సమ్మకాన్ని గౌరవిస్త్తూ ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌’ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్‌లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం కేటాయించడం జరుగుతుంది. అలా హనుమంతుడి కోసం ప్రతి ధియేటర్‌లో ఒక్క సీటు ఖాళీగా ఉంచుతారన్న మాట.

అతి గొప్ప రామ భక్తుడిని గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌తో భారీ హంగులతో నిర్మించిన ‘ఆదిపురుష్‌ చిత్రాన్ని హనుమంతుడి సమక్షంలో చూద్దాం’’ అంటూ మేకర్స్‌ ఓ పోస్టర్‌ విడుదల చేశారు.

ప్రస్తుతం దీనికి సంబంధించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ ఐడియా కొత్తగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. పబ్లిసిటీ పరంగా ఇది వర్కవుట్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే థియేటర్‌ అంతా ఫుల్‌ అయినా ఒక్క సీటు ఖాళీగా ఉంటే థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుల చూపు యాదృచ్చికంగానే అటువైపు పడుతుంది. అక్కడ ఓ హనుమంతుడి ప్రతిమ ఉంచితే.. ప్రేక్షకుల్లోనూ కాస్త భక్తి పారవశ్యం కలుగుతుంది.

అయితే ఇలాంటి ప్రమోషన్‌ కొన్నేళ్ల క్రితం ‘అమ్మోరు’ సినిమాకు చేశారు. సినిమా ప్రదర్శన జరుగుతున్నప్పుడే.. తెర ముందు హారతులు ఇచ్చేవారు. స్ర్కీన్‌ ముందు ప్రసాదాలు సమర్పించేవారు. థియేటర్‌ బయట ఓ మినీ గుడి వెలిసేది. పూజలు నిర్వహించేవారు. కొందరు మహిళలకు అయితే పూనకాలే వచ్చేవి. ఇవన్నీ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడంతో అప్పట్లో ఆ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు అలాంటి ఐడియానే ‘ఆదిపురుష్‌’కి అప్లై చేస్తున్నారు. నేటి ట్రెండ్‌ ప్రకారం... మేకర్స్‌ ఐడియా ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

Hanuman.jpg

Updated Date - 2023-06-06T15:37:02+05:30 IST