Sonusood: రైల్వేకు క్షమాపణ.. సున్నితమైన కౌంటర్‌!

ABN , First Publish Date - 2023-01-06T13:42:51+05:30 IST

సోనుసూద్‌ రీల్‌ హీరో మాత్రమే కాదు రియల్‌గానూ హీరోనే. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వ్యవస్థలాగా ఆయన దేశవ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి వీలైనంత సాయం చేశారు.

Sonusood: రైల్వేకు క్షమాపణ.. సున్నితమైన కౌంటర్‌!

సోనుసూద్‌ (Sonu sood) రీల్‌ హీరో మాత్రమే కాదు రియల్‌గానూ హీరోనే. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వ్యవస్థలాగా ఆయన దేశవ్యాప్తంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి వీలైనంత సాయం చేశారు. తాజాగా ఆయనపై నార్త్‌ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేయడం పట్ల రైల్వే డిపార్ట్‌మెంట్‌ మండి పడింది. ఫుడ్‌బోర్డ్‌ ప్రయాణం ప్రమాదకరమని సూచించింది. ఇంకోసారి ఇలాంటి చర్యలకు పాల్పొడొద్దని హెచ్చరించింది. (Actor sonusood)

అసలు విషయం ఏంటంటే ఇటీవల సోనూసూద్‌ రైలులో ప్రయణిస్తున్న వీడియో ఒకటి షేర్‌ చేశారు. రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ ఫుట్‌బోర్డు వద్ద కూర్చుని బయటకు చూస్తూ కనిపించాడు. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. దీనిపై నార్త్‌ రైల్వే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘డియర్‌ సోనూసూద్‌.. మీరు ప్రపంచంలోని లక్షల మందికి ప్రజలకు రోల్‌ మోడల్‌. రైలు ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం ప్రమాదకరం. ఈ రకమైన వీడియోల వల్ల మీ అభిమనులకు తప్పుడు సందేశం అందుతుంది. దయచేసి మరోసారి ఇలా చేయకండి. సురక్షితమైన ప్రయాణం ఆనందించండి’’ అని ఉత్తర రైల్వే ట్వీట్‌ చేసింది. ముంబై రైల్వే కమిషనర్‌ కూడా ఇది ప్రమాదకరమని ట్వీట్‌ చేసింది. నిజ జీవితంలో ఇలాంటి స్టంట్‌ చేయొద్దని కోరింది. ( apology to Railway)

‘‘సోనుసూద్‌ ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం మీ సినిమాలోని ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఓ భాగం కావచ్చు. కానీ నిజ జీవితంలో కాదు. భద్రత మార్గదర్శకాలను పాటించండి’’ అని ముంబై రైల్వే కమిషనర్‌ ట్వీట్‌ చేసింది. కొందరు నెటిజన్లు కూడా సోనూని విమర్శించారు. దీనికి సోనూ స్పందించారు. ‘‘నేను ట్రైన్‌ గేట్‌ దగ్గర కూర్చొవడం తప్పే. రైలు తలుపుల వద్దే కూర్చుని మగ్గిపోతున్న లక్షలాది మంచి పేదల జీవితాలను గురించి ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాను. మీరు ఇచ్చన సందేశానికి, రైల్వే వ్యవస్థ పనితీరును మెరుగు పరచిపందుకు ధన్యవాదాలు’’ అని అన్నారు సోనూసూద్‌.

Updated Date - 2023-01-06T13:47:44+05:30 IST