సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sonu sood: బీహార్‌లో అనాథ ఆశ్రమానికి అండగా..

ABN, First Publish Date - 2023-05-30T13:35:51+05:30

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు సోనూసూద్‌ (Sonu sood). వలస కార్మకులు, పేదలు , విదేశాల్లో ఉండిపోయిన ఎంతోమంది 'ఆపదలో ఉన్నాం' అని చిన్న సందేశం ఇవ్వడం చాలు ‘నేనున్నా’ అంటూ సహకారం అందించి రియల్‌ హీరో అనిపించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో వేలాది మందికి అండగా నిలిచారు సోనూసూద్‌ (Sonu sood). వలస కార్మకులు, పేదలు , విదేశాల్లో ఉండిపోయిన ఎంతోమంది 'ఆపదలో ఉన్నాం' అని చిన్న సందేశం ఇవ్వడం చాలు ‘నేనున్నా’ అంటూ సహకారం అందించి రియల్‌ హీరో అనిపించుకున్నారు. తాజాగా సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనాథ పిల్లలకు సాయం చేయడానికి ముందుకొచ్చారు. బీహార్‌కు చెందిన ఓ యువకుడు సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో అనాథ పిల్లల కోసం ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ (International Child school)ప్రారంభించాడు. ఇప్పటికే అందులో 100 మంది పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్‌ అక్కడికి వెళ్లి ఆ యువకుడితో మాట్లాడారు. (International Orphan Home) ఆయనతో చర్చించిన తర్వాత.. పిల్లలకు మెరుగైన వసతి, విద్య, ఆహారం అందించడానికి కావాల్సిన సాయం అందించారు.

అంతేకాదు ఆ చిన్నారుల కోసం కొత్తగా స్కూల్‌ బిల్డింగ్‌ను కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇకపై ఆ పిల్లల బాధ్యతలో తానూ భాగమవుతానని చెప్పారు. దానికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆయన్ను మెచ్చుకుంటున్నారు. మరోసారి మీ గొప్ప మనసు చాటుకున్నారు అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఆయన్ని అభిమానించే వాళ్ళు మనుషుల్లో మహానుభావుడివని, సేవ కార్యక్రమాలకి మహారాజువని కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-05-30T14:31:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!