సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sobhita Dhulipala: తప్పులేనప్పుడు కంగారు ఎందుకు?

ABN, First Publish Date - 2023-05-08T15:03:35+05:30

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జంట కలిసి కెమెరాకు చిక్కారంటే వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు పుట్టుకొచ్చేస్తాయి (Dating Rumours) .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన జంట కలిసి కెమెరాకు చిక్కారంటే వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే వార్తలు పుట్టుకొచ్చేస్తాయి (Dating Rumours) . అక్కడ ఉన్నది స్నేహమా, ప్రేమ అన్నది ఆలోచించే తీరిక కూడా ఉండదు. ఏదో సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తారు. లవ్‌బర్ట్స్‌, డేటింగ్‌ అంటూ ట్యాగులిస్తారు. ఆ ఇద్దరి నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం నాగచైతన్య (naga chaitanya)- శోభిత (Sobhita Dhulipala) డేటింగ్‌ ఇలాంటి విషయంలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఓ సారి లండన్‌ వెకేషన్‌, మరోసారి రెస్టారెంట్‌లో జంటగా కనిపించడంతో ఈ డేటింగ్‌ రూమర్స్‌ మరింత బలపడ్డాయి. సమంతతో విడాకులు తర్వాత శోభితతో చైత ప్రేమలో ఉన్నాడని వార్తలు హల్‌చల్‌ చేశాయి. (Sobhita Dhulipala reacts on RumoursO

ఇటీవల ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’తో అలరించిన శోభిత డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించారు. ‘‘వైజాగ్‌ నుంచి వచ్చిన సాధారణ అమ్మాయిని. సినిమాల్లో ఇలా నిలదొక్కుకుంటున్నానంటే నా కష్టం, ప్రతిభ కారణం అని నమ్ముతాను. అలాగే నాకు వస్తున్న అవకాశాలు కూడా. నటిగా మంచి సినిమాలు చేస్తున్నాను. మణిరత్నం డైరెక్షన్‌లో ఇటీవలే పొన్నియన్‌ సెల్వన్‌ సినిమా చేశాను. వృత్తిరీత్యా చాలా ఆనందంగా ఉన్నా. ఇంత మంచి మధుర జ్ఞాపకాలున్నా నన్ను ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన పని లేదు. ఆ రూమర్‌తో నాకు అసలు సంబంధం లేదు. నేను ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు ఎవరో ఏదో అన్నారని, రాశారని అర్జంటుగా వెళ్లి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముందనిపించింది. నాపై ఏ తప్పూ లేనప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను’’ అని శోభిత ధూళిపాల చెప్పారు. ఆమె నటించిన ‘పొన్నియన్‌ సెల్వన్‌-2’ ఇటీవల విడుదలై విజయం సాధించింది. ప్రస్తుతం సితార, మంకీ మ్యాన్‌ చిత్రాలతో బిజీగా ఉంది.

Updated Date - 2023-05-08T15:10:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!