Skanda Twitter Review : బోయపాటి.. రామ్.. తమన్ సంభవం

ABN , First Publish Date - 2023-09-28T10:42:09+05:30 IST

నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్‌’(skanda). రామ్‌ పోతినేని (Ram pothineni), శ్రీలీల (shree leela) జంటగా నటించారు. శ్రీనివాస సిల్లర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ట్రైలర్‌ విడుదలయ్యాక విపరీతంగా హైప్‌ వచ్చింది.

Skanda Twitter Review : బోయపాటి.. రామ్.. తమన్ సంభవం

నందమూరి బాలకృష్ణతో ‘అఖండ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘‘స్కంద’-ది ఎటాకర్‌’(skanda). రామ్‌ పోతినేని (Ram pothineni), శ్రీలీల (shree leela) జంటగా నటించారు. శ్రీనివాస సిల్లర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ట్రైలర్‌ విడుదలయ్యాక విపరీతంగా హైప్‌ వచ్చింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు సినిమా పట్ల తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్కంద కథ ఏంటి అన్న దానిపై ట్విట్టర్‌లో చర్చ జరుపుతున్నారు. ఈ సినిమా గురించి నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం..

మామూలుగా అయితే విదేశాల్లో ఏ సినిమాకైనా ప్రీమియర్‌ షో పడుతుంది. కానీ ఈ చిత్రానికి ఆ ఏర్పాట్లు చేయలేదు. ఇండియాలో విడుదలైనట్లే అక్కడ కూడా విడుదల అయ్యాయి. సినిమా చూసిన కొందరు ట్విటర్‌లో షేర్‌ చేసి దాన్నిబట్టి చూస్తే.. సినిమాలో కథా బలం తక్కువగా ఉందని తెలుస్తోంది. అయితే రామ్‌ పోతినేని మాస్‌ ఎనర్జీతో మెప్పించాడని ప్రేక్షకుల్ని అలరించాడని తెలుస్తోంది. మాస్‌ ఆడియన్స్‌కి మాత్రమే సినిమా బాగా నచ్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ ఫైట్స్‌ ఎలివేషన్‌తోపాటు తమన్‌ సంగీతం బాగా అలరిస్తుందని చెబుతున్నారు.

ప్రథమార్థం యావరేజ్‌గా ఉందని, ఓవరాల్‌గా సినిమా బావుందని అంటున్నారు. మాస్‌ కల్ట్‌ రైడ్‌ అని, ఉస్తా్‌ రామ్‌ ఎక్కడా నిరుత్సాహ పరచలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. రామ్‌ ఎనర్జీని రెట్టింపుగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. మెలో డ్రామా, క్లైమాక్స్‌ సీన్స్‌ సినిమాను నిలబెట్టాయని చెబుతున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా పార్ట్‌ -2 కూడా ఉంటుందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రామ్‌ నటన మాత్రం ర్యాంపేజ్‌ అని రాస్తున్నారు.

Updated Date - 2023-09-28T11:39:54+05:30 IST