Nani: నాని సినిమాలో విలన్ పాత్రకి సూర్య పారితోషికం వింటే షాకవుతారు

ABN , First Publish Date - 2023-11-13T16:14:36+05:30 IST

తెలుగు క్యారెక్టర్ నటులకి అతి తక్కువ పారితోషికం ఇస్తూ వస్తున్న తెలుగు నిర్మాతలు, పరభాషా నటులకి మాత్రం కోట్లలో డిమాండ్ చేస్తున్నా వాళ్ళు అడిగినంత ఇచ్చి తెలుగు సినిమాలో పెట్టుకుంటున్నారని ఒక టాక్ నడుస్తోంది. ఇప్పుడు నాని సినిమాలో చేస్తున్న ఎస్ జె సూర్య పారితోషికం ఎన్ని కొట్లో తెలిస్తే షాకవుతారు.

Nani: నాని సినిమాలో విలన్ పాత్రకి సూర్య పారితోషికం వింటే షాకవుతారు
Nani and SJ Suryah

నాని (Nani) ఇప్పుడు 'హాయ్ నాన్న' #Hi Nanna సినిమాకి ప్రచారాలు చేస్తూనే, ఇంకో సినిమా 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram) షూటింగ్ కూడా చేస్తున్నాడు. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ (VivekAthreya) దర్శకుడు, ఇందులో ప్రియాంక మోహన్ (PriyankaArulMohan) కథానాయికగా నటిస్తుండగా ఎస్ జె సూర్య విలన్ (SJSuryah) పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం. 'ఆర్ఆర్ఆర్' #RRR నిర్మించిన డివివి దానయ్య (DVVDanayya) ఈ 'సరిపోదా శనివారం' సినిమాకి నిర్మాత.

అయితే ఇప్పుడు చాలామంది తెలుగు కథానాయకులు పాన్ ఇండియా మోజులో పడిపోయారు అని ఒక టాక్ వస్తోంది. అందుకోసమని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ ఇలా తెలుగు వాళ్ళని కాకుండా వేరే భాషా నటుల్ని ఆ పాత్రలకి వాళ్ళు సరిపోకపోయినా, పారితోషికం ఎక్కువ డిమాండ్ చేస్తున్నా పరభాషా నటులనే తీసుకువస్తున్నారు అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

SJsuryahremunerationforNani.jpg

ఇప్పుడు నాని సినిమా 'సరిపోదా శనివారం' లో ఎస్ జె సూర్య ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టుగా సమాచారం. దీనికి అతని అడిగిన పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు మీరు. అతను రూ. 10 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని, నిర్మాత కొంచెం తగ్గించమని అడుగుతున్నారని తెలుస్తోంది. పరిశ్రమలో నడుస్తున్న టాక్ ఏంటంటే, ఇప్పుడు సినిమాలో వేస్తున్న కథానాయకులు ఏ పాత్రకి ఎవరు వెయ్యాలన్నది కూడా వాళ్ళే నిర్ణయిస్తున్నారని, అందుకని నిర్మాతకి ఖర్చులు చాలా ఎక్కువయ్యాయని కూడా తెలుస్తోంది. (SJ Surya is demanding a remuneration of Rs 10 crore for Nani's Saripodhaa Sanivaaram)

తెలుగు నటుల్ని ప్రోత్సహించాల్సింది పోయి, పరభాషా నటుల్ని ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నా వాళ్లనే కావాలని తీసుకువస్తున్నారని, ఇలా చేయడంవలన నిర్మాతలు చాలా ఒత్తిళ్లకు గురవుతున్నారని పరిశ్రమల టాక్ నడుస్తోంది. ఎస్ జె సూర్య ఇంతకు ముందు సినిమాలు 'జిగర్ తండా డబుల్ ఎక్స్' #JigarThandaDoubleX, 'మార్క్ ఆంటోనీ' #MarkAntony తమిళంలో బాగానే ఆడాయని, తెలుగులో మాత్రం ఆ రెండు సినిమాలు నడవలేదని, అయినా అతనే ఆ సినిమాలో ఉండాలని అతను అడిగిన పారితోషికం ఇచ్చి తీసుకుంటున్నారని ఒక వార్త నడుస్తోంది.

Updated Date - 2023-11-13T17:04:56+05:30 IST