సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

S. J. Surya: ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలని..!

ABN, First Publish Date - 2023-03-12T19:26:55+05:30

ఓ పక్క సినిమాలు, మరో పక్క ఏపీలో రాజకీయం ఇలా రెండు వైపులా బిజీగా ఉన్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌. జనసేన పార్టీ అధినేతగా ఏపీ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ పక్క సినిమాలు, మరో పక్క ఏపీలో రాజకీయం ఇలా రెండు వైపులా బిజీగా ఉన్నారు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌(Pawan kalyan) జనసేన పార్టీ (janasena party) అధినేతగా ఏపీ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టి ఈ నెల శనివారానికి 27 (27 Years for Pawankalyan) సంవత్సరాలు, జనసేన పార్టీ ప్రారంభించి ఈ నెల 14వ తేదికి పదేళ్లు కావొస్తుంది. ఈ సందర్భంగా వివిధ రంగాల నుంచి పవన్‌కల్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ మేరకు దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత ఎ.ఎం.రత్నం సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా పవన్‌కల్యాణ్‌తో ‘ఖుషి’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తీసిన దర్శకుడు, నటుడు ఎస్‌.జె.సూర్య (SJ Surya) పవన్‌కు అభినందనలు తెలిపారు. పవన్‌కల్యాణ్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చూడాలనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోనను జనసేన ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. (10 Years of Janasena)

‘‘27 ఏళ్ల పవనిజం.. పవన్‌ కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ అంటే మిలియన్ల కొద్దీ అభిమానులకు ఎంతో విశ్వాసం. ఆయన వెండి తెరపైనే కాదు.. జనాల్లో కూడా హీరోనే. గ్రేట్‌ పొలిటికల్‌ లీడర్‌. 27 ఏళ్లగా సినీ అభిమానులను అలరిస్తున్నారు. జనసేన అధినేతగా పదేళ్లుగా పని చేస్తున్నారు. ప్రజల కోసం పవన్‌ చేేస పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ అని గర్వంగా చెప్పుకునే రోజు కోసం చాలామంది లాగే నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని వీడియోలో పేర్కొన్నారు ఎస్‌.జె.సూర్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి’ చిత్రం రికార్డులు సృష్టించింది. ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘కొమరం పులి’ డిజాస్టర్‌గా నిలిచింది.

Updated Date - 2023-03-12T19:38:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!