Siva rajkumar: యాక్షన్‌ డ్రామా ‘వేద‘

ABN , First Publish Date - 2023-01-29T18:27:00+05:30 IST

కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ నటించిన చిత్రం ‘వేద’. ఆయనకిది 125వ చిత్రం. మరో ప్రత్యేకత ఏంటంటే ఆయన భార్య గీత శివరాజ్‌కుమార్‌ నేతృత్వంలో గీత పిక్చర్స్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిది.

Siva rajkumar: యాక్షన్‌ డ్రామా ‘వేద‘

కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ (siva rajkumar)నటించిన చిత్రం ‘వేద(veda). ఆయనకిది 125వ చిత్రం. మరో ప్రత్యేకత ఏంటంటే ఆయన భార్య గీత శివరాజ్‌కుమార్‌ నేతృత్వంలో గీత పిక్చర్స్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం కన్నడ నాట సంచలన విజయం సాధించింది. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్‌ ద్వారా ఈ సినిమా తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. నిర్మాత వి.ఆర్‌.కృష్ణ మండపాటి మాట్లాడుతూ ‘‘యాక్షన్‌ డ్రామాగా రూపొందిన చిత్రమిది. త్వరలో ప్రీ రిలీజ్‌ వేడుక చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-01-29T18:27:01+05:30 IST