Singer Sunitha: అందుకు దేవుడిని నిందిస్తూనే ఉంటా

ABN, First Publish Date - 2023-06-04T17:10:59+05:30

గాన గంధర్వుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా మధుర గాయని సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. బాలు అంటే ఆమెకు ఎంతో అభిమానం. ఆప్యాయంగా మావయ్య అని పిలిచే చనువు ఉందామెకి.

Singer Sunitha: అందుకు దేవుడిని నిందిస్తూనే ఉంటా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాన గంధర్వుడు ఎస్‌.పి బాలసుబ్రహ్మణ్యం (Sp Balu) జయంతి సందర్భంగా మధుర గాయని సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ (Sunitha Emotional post) పెట్టారు. బాలు అంటే ఆమెకు ఎంతో అభిమానం. ఆప్యాయంగా మావయ్య అని పిలిచే చనువు ఉందామెకి. ఎస్‌బీపీకి సంబంధించిన ఏ విషయాన్ని ఆమె మరచిపోరు. ఆదివారం బాలు జయంతి సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సునీత. ఆయనను తలచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ఆయనతో దిగిన ఫోటోను పంచుకున్నారు. ‘‘నిన్నటి నిజం.. ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా.. పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుణ్ని ఈ రోజును మాత్రం ఎప్పటికి నిందిస్తూనే ఉంటా.’ అంటూ పోస్ట్‌ చేశారు. (Spb Birth Aniversary)

16 భాషల్లో 50 వేలకు పైగా పాటలను పాడి సంగీత ప్రియులను అలరించిన గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం కరోనాతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ 2020 సెప్టెంబర్‌ 25న మరణించిన సంగతి తెలిసిందే!

Updated Date - 2023-06-04T17:13:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!