Singer Sri vardhini : ఎదగాలనుకున్న చోట అవన్నీ పట్టించుకోకూడదు!

ABN , First Publish Date - 2023-06-12T10:22:45+05:30 IST

సంగీత దర్శకుడు తమన్‌(Thaman).. ఆయన భార్య శ్రీవర్ధిని (Srivardhini) గురించి ప్రశ్నించిన ప్రతిసారి ఏ సమాధానం చెప్పకుండా జారుకుంటారు. వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడను అంటూ సైడ్‌ అయిపోతారు. ఆయన భార్య శ్రీవర్ధిని తొలిసారి భర్త తమన్‌ గురించి మాట్లాడింది.

Singer Sri vardhini : ఎదగాలనుకున్న చోట అవన్నీ పట్టించుకోకూడదు!

సంగీత దర్శకుడు తమన్‌(Thaman).. ఆయన భార్య శ్రీవర్ధిని (Srivardhini) గురించి ప్రశ్నించిన ప్రతిసారి ఏ సమాధానం చెప్పకుండా జారుకుంటారు. వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడను అంటూ సైడ్‌ అయిపోతారు. ఆయన భార్య శ్రీవర్ధిని తొలిసారి భర్త తమన్‌ గురించి మాట్లాడింది. ఆయనపై వస్తోన్న కాపీ క్యాట్‌ ట్రోలింగ్‌పై ఆమె స్పందించింది. శ్రీవర్ధిని గాయని. మణిశర్మ దగ్గర పని చేశారు. తెలుగు తమిళ భాషల్లో 200లకు పైగా పాటలు పాడారు. ‘కిక్‌’ చిత్రంలో ‘మనసే తడిసేలా’ పాటనె ఆమె పాడారు. అంతే కాదు ఈ మధ్య సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయిన ‘టమ్‌ టమ్‌’ (tum tum) సాంగ్‌ శ్రీవర్ధినే పాడారు. తాజాగా ఇచ్చిన ఇంటర్యూలో ‘విమర్శలను మేం అసలు పట్టించుకోం’ అని చెప్పారామె. (No care on Trolling)

‘‘తమన్‌ - నేనూ మణిశర్మ గారి వద్ద పనిచేశాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లయ్యాక సుమారు ఆరేళ్లు నాకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఓ తమిళ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. అది నాకెంతో స్పెషల్‌ పాట. తమన్‌ సంగీతం అందించిన ‘కిక్‌’ సినిమాలో ‘మనసే తడిసేలా’ పాట పాడాను. అది ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం. ఆయన ట్రోలింగ్‌ గురించి అసలు పట్టించుకోరు. ఏ రంగంలో అయినా విమర్శలను పట్టించుకుంటే ఎదగాలకునే మార్గంలో ముందడుగు వేయలేం. సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ నేను కూడా చదవను. నెగెటివ్‌ కామెంట్స్‌ చూస్తే బాధ కలుగుతుందని తెలిసినప్పుడు.. వీడియో కింద వచ్చే కామెంట్స్‌ చదవడం ఎందుకు? అని నేను అనుకుంటా’’ అని అన్నారు. శ్రీవర్ధిని తెలుగు, తమిళంలో ఎన్నో పాటలు పాడారు. ‘స్టూడెంట్‌ నెం:1’లోని ‘ఒకరికి ఒకరై ఉంటుంటే’ పాట కోసం మొదటిసారి తెలుగులో పనిచేశారు. ‘గంగోత్రి’, ‘అశోక్‌’, ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమోరీస్‌’, ‘తీన్‌మార్‌’, ‘కిక్‌’.. ఇలా తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటిదాకా 200 పాటలు పాడారు.

Updated Date - 2023-06-12T10:55:08+05:30 IST