సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Singer Rakshita Accident: 10 సెకెన్లతో జీవితమంతా కళ్లల్లో మెదిలింది!

ABN, First Publish Date - 2023-05-07T21:08:06+05:30

ప్రముఖ సింగర్‌ రక్షిత సురేశ్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారం మలేషియాలో ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు దెబ్బతింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సింగర్‌ రక్షిత సురేశ్‌ (Rakshita Suresh) రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారం మలేషియాలో ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు దెబ్బతింది. ఈ ప్రమాదంలో గాయనికి (Singer Rakshita Suresh) చిన్నపాటి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ ప్రమాదం విషయాన్ని రక్షిత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘ఈరోజు పెద్ద ప్రమాదమే జరిగింది. ఉదయం మలేషియా విమానాశ్రయానికి వెళ్తుండగా నేను ప్రయాణిస్తున్న (Rakshita Suresh met accident) కారు డివైడర్‌ను కొట్టింది. ముందు భాగమంతా నుజ్జునుజ్జయింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ నా ప్రాణాలు కాపాడాయి. అవే లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. జరిగింది తలుచుకుంటే ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది. డ్రైవర్‌, నేను, మరో ప్యాసింజర్‌ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాం. ఏది ఏమైనా చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డందుకు మేము చాలా అదృష్టవంతులం. కానీ ఆ 10 సెకన్లలో నా జీవితమంతా కళ్ల ముందు మెదిలింది’’ అని రాసుకొచ్చింది.

రక్షిత సురేశ్‌.. ఇటీవల ‘పొన్నియన్‌ సెల్వన్‌2’ (Ponniyin Selvan: II) కన్నడ వెర్షన్‌లో ‘కిరునగే’, వీర రాజా వీర పాటలు పాడారు. రిథమ్‌ తఽథిమ్‌, లిటిల్‌ స్టార్‌ సింగర్‌ 2009 విజేతగాగా నిలిచిన ఆమె సూపర్‌ సింగర్‌ 6లో రన్నరప్‌గా నిలిచింది. తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు హిందీలోనూ పాటలు పాడి తన సత్తా చాటారు.

Updated Date - 2023-05-07T21:11:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!