Singer Nava Sandeep: ప్రేమ పేరుతో మహిళను మోసగించిన సింగర్‌

ABN , First Publish Date - 2023-08-20T11:07:05+05:30 IST

ప్రేమ పేరుతో జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌, సింగర్‌ నవ సందీప్‌ ఓ యువతిని మోసం చేశాడని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోక్‌ సింగర్‌గా గుర్తింపు పొంది జబర్దస్త్‌ శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల్లో పలు సందర్భాల్లో తన పాటలతో అలరించిన నవ సందీప్‌ ఓ యువతిని లోబర్చుకుని మోసగించాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Singer Nava Sandeep: ప్రేమ పేరుతో మహిళను మోసగించిన సింగర్‌

ప్రేమ పేరుతో జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌, సింగర్‌ నవ సందీప్‌(Singer Nava sandeep) ఓ యువతిని మోసం చేశాడని గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫోక్‌ సింగర్‌గా గుర్తింపు పొంది జబర్దస్త్‌(Jabardasth comedian) శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోల్లో పలు సందర్భాల్లో తన పాటలతో అలరించిన నవ సందీప్‌ ఓ యువతిని లోబర్చుకుని మోసగించాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. (Folk singer)

అసలు విషయంలోకి వెళ్తే.. అమీర్‌పేట్‌కు చెందిన ఓ యువతి సందీప్‌కు వాట్సాప్‌ ద్వారా పరిచయమైంది. కొంతకాలానికి మాటలు పెరగడంతో పరిచయం ప్రేమగా మారింది. దాంతో సదరు యువతి సందీప్‌ దగ్గర పెళ్లి చేసుకుందాం అనే ప్రస్తావన తీసుకురాగా అతను మొహం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన యువతి గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన గోల్కొండ పోలీసులు ఆ కేసును మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో జానపద గీతాలు పాడిన నవ సందీప్‌ ఓ వేదికపై నందమూరి బాలకృష్ణ ముందు ‘బాలయ్యబాబు గారూ.. మీకు సాటి ఎవ్వరూ లేరు.. నేను చేసినాను హోరు’ అంటూ పాడిన పాట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే! (Case file on Folk singer)

Updated Date - 2023-08-20T11:17:17+05:30 IST