SIIMA Awards : దుబాయిలో ఘనంగా సైమా..

ABN , First Publish Date - 2023-09-16T15:14:14+05:30 IST

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుక దుబాయి వేదికగా వైభవంగా జరిగింది. రెడ్‌ కార్పెట్‌తో దక్షిణాదికి చెందిన తారలు తళుక్కున మెరిశారు.

SIIMA Awards : దుబాయిలో ఘనంగా సైమా..

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 వేడుక (SIIMA 2023) దుబాయి వేదికగా వైభవంగా జరిగింది. రెడ్‌ కార్పెట్‌తో దక్షిణాదికి చెందిన తారలు తళుక్కున మెరిశారు. 15న జరిగిన కార్యక్రమంలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులు హాజరయ్యారు. 16వ తేదిన జరగబోయే వేడుకలో తమిళ, మలయాళ తారలు సందడి చేయనున్నారు. 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ సైమా పురస్కారాన్ని అందుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)చిత్రంలో కొమురం భీమ్‌ పాత్రకుగానూ ఈ అవార్డు వరించింది. అలాగే ‘ధమాకా’లో నటనకు శ్రీలీల (Shree leela) ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా ‘సీతారామం’(Sitaramam) , ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి (Rajamouli) ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌, రానా. ప్రణీత, నిఖిల్‌, శ్రీలీల, మృణాల్‌ ఠాకూర్‌, అశ్వినీదత్‌, సుధీర్‌బాబు, అనన్యా నాగళ్ల, హిమజ, భాను తదితరులు పాల్గొన్నారు.

12.jpg


4.jpg

సైమా 2023 - విజేతలు వీరే...

ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)


ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)


ఉత్తమ చిత్రం: సీతారామం


ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)


ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)


ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)

1.jpg
ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)


ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)


ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)


ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)


ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)


ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

3.jpg
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు)


ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)


సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2


ఉత్తమ నటుడు : అడవి శేష్‌ (మేజర్‌-క్రిటిక్స్‌)


ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)


ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌


ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌


45.jpg

Updated Date - 2023-09-16T15:14:14+05:30 IST