siddharth calls aditi rao: అదితి, సిద్దార్థ్ త‌గ్గ‌డం లేదుగా.. నా పార్ట్‌న‌ర్ అంటు క‌విత్వం

ABN , First Publish Date - 2023-10-29T13:43:44+05:30 IST

ల‌వ్ బ‌ర్డ్స్ హైద‌రాబాదీ అదితి రావ్ హైద‌రీ, సిద్దార్థ్, మ‌రోసారి వార్తోల్లోకెక్కారు. నిన్న(అక్టోబర్ 28)న అదితి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా పార్ట్‌నర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ సిధార్థ్ రాసిన క‌విత్వం ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్‌గా మారింది.

siddharth calls aditi rao: అదితి, సిద్దార్థ్ త‌గ్గ‌డం లేదుగా.. నా పార్ట్‌న‌ర్ అంటు క‌విత్వం
aditi

ల‌వ్ బ‌ర్డ్స్ హైద‌రాబాదీ అదితి రావ్ హైద‌రీ(aditi rao hydari ), సిద్ధార్థ్(Siddharth) మ‌రోసారి వార్తోల్లోకెక్కారు. నిన్న(అక్టోబర్ 28)న అదితి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా పార్ట్‌నర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ సిద్ధార్థ్రాసిన క‌విత్వం ఇప్పుడు అంత‌టా హాట్ టాపిక్‌గా మారింది. 2021లో తెలుగులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా RX100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మ‌హాస‌ముద్రంలో అదితి ఓ హీరోయిన్‌గా న‌టించింది.

SIDDHU.jpg

అప్ప‌టినుంచి ఇద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ బంధంతో రెండేండ్లుగా రిలేషన్ షిప్‌లో మునిగి తేలుతున్నారు. ఎక్క‌డికి వెళ్లిన క‌లిసే తిరుగుతున్నారు, వేడుక‌ల్లో పాల్గొంటున్నారు. సోష‌ల్ మీడియాలో వీరి బంధం గురించి చాలా సార్లు వార్త‌లు వైర‌ల్ అయిన‌ప్ప‌టికీ ఏనాడూ స్పందించ‌కుండా ఇండైరుక్టుగా ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉన్న‌ద‌న్న‌ట్లుగానే వ్య‌వ‌హ‌రం న‌డిపిస్తూ వ‌స్తున్నారు.

SIDDHU-ADITI.jpg

గ‌తేడాది అదితి(aditi rao hydari ), పుట్టిన రోజు సంద‌ర్భంగా నా హృద‌య‌రాణికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ సిద్ధార్థ్ చేసిన పోస్టు వారి మ‌ధ్య బంధం న‌డుస్తున్న‌ద‌నే విష‌యానికి బ‌లం చేకూర్చింది. ఆపై హైద‌రాబాద్‌లో శ‌ర్వానంద్ పెళ్లికి క‌లిసి వెళ్ల‌డం కూడా పెద్ద చ‌ర్చ‌కే దారి తీసింది. అయితే సిద్ధార్థ్ (Siddharth) క‌విత్వానికి అదితి రెస్పాండ్ అయ్యి చాలా రోజుల నుంచి క‌లిసి ఉంటున్నాం.. కానీ నువ్వు కవివి అని నాకు తెలియదు నీ గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంది అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి ఇన్ స్టా పోస్టులు నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.


ఇదిలాఉండ‌గా వీరిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోను ద‌ర్శ‌కుడు అజ‌య్‌భూప‌తి షేర్ చేస్తూ వీళ్లింద‌రూ క‌ల‌వ‌డానికి నేనే కార‌ణం అంటూ చాలామంది అడుగుతున్నారంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. సిద్ధార్థ్ చివరగా త‌నే స్వ‌యంగా నిర్మించిన చిన్నా చిత్రంలో న‌టించ‌గా ఆ చిత్రానికి దేశ‌వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అదేవిధంగా అదితి దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా వ‌య్చిన మే సినామిక అనే సినిమాలో, తాజ్, జూబ్లీ అనే వెబ్ సిరీస్‌ల‌లో కనిపించింది. మరో ఆసక్తికరమైన విషయేమేమిటంటే ఇటలీలో జరుగనున్న వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠిల పెళ్లికి కూడా ఈ జంట కలిసి వెళ్లింది.

Updated Date - 2023-10-29T14:20:52+05:30 IST