Shruti Haasan: అది నాకు దక్కిన అదనపు వరం!

ABN , First Publish Date - 2023-02-02T18:57:07+05:30 IST

ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’(waltair veerayya), ‘వీరసింహారెడ్డి’ (Veerasimhareddy)చిత్రాలతో రెండు హిట్లు అందుకున్నారు శ్రుతీహాసన్‌. తెలుగు, తమిళ చిత్రాలతోనే కాకుండా హిందీలోనూ ఆమె అలరిస్తున్నారు. v

Shruti Haasan: అది నాకు దక్కిన అదనపు వరం!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’(waltair veerayya), ‘వీరసింహారెడ్డి’ (Veerasimhareddy)చిత్రాలతో రెండు హిట్లు అందుకున్నారు శ్రుతీహాసన్‌. తెలుగు, తమిళ చిత్రాలతోనే కాకుండా హిందీలోనూ ఆమె అలరిస్తున్నారు. నటిగానే కాకుండా గాయనిగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కూడా రాణిస్తున్నారు. సంక్రాంతికి రెండు చిత్రాల సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆమె ప్రస్తుతం ఆ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. శ్రుతీహాసన్‌ ( (Shruti Haasan)నటించిన ‘లక్‌’ (luck) చిత్రం విడుదలై 14 (14 years for luck movie) ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో శ్రుతీ పంచుకున్న విశేషాలు...

‘‘ఏ హీరోయిన్‌ అయినా తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం, రెండూ సక్సెస్‌ కావడం అరుదుగా జరుగుతుంది. ఈ ఏడాది ఆ అదృష్టం నాకు దక్కింది. నా తొలి హిందీ చిత్రం ‘లక్‌’ విడుదలై 14 ఏళ్లు అయింది. సినీ పరిశ్రమలోకి వచ్చినప్పుడు నా సింగింగ్‌ కెరీర్‌ గురించి ఎక్కడా మాట్లాడొద్దని చాలామంది చెప్పేవారు. అలా చేస్తే ఆ ప్రభావం సినిమాపై పడుతుందని భయపెట్టేవారు. కానీ నేను మాత్రం రెండింటికి ఇంపార్టెన్స్‌ ఇస్తూ ముందుకెళ్లాను. నేను మొదటిసారి మైకు ముందుకు వచ్చిన సందర్భం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆరోజు నేనెలా పాడతానో అని నాన్న చాలా భయపడ్డారు. కరోనా సమయంలో నా మ్యూజిక్‌ ప్రొఫెషన్‌ను చాలా మెరుగుపరచుకున్నా. ఆ తర్వాత స్టేజ్‌ షోల్లో పాల్గొని ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన అందుకోవడంతో చాలా ఆనందంగా అనిపించింది. అలాగే పాటలు రాయడం కూడా నేర్చుకున్నా. అది దేవుడు నాకు ఇచ్చిన వరం. మిగతా ప్రపంచంతో దానిని పంచుకోగలగడం అదనపు వరం’’ అని చెప్పారు. ప్రస్తుతం శ్రుతి హాసన్‌ పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో ప్రభాస్‌ సరసన నటిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ ఈ చిత్రానికి దర్శకుడు.

Updated Date - 2023-02-02T18:59:10+05:30 IST