Shruti Haasan: ఈ సంవత్సరం హిట్ హీరోయిన్

ABN , First Publish Date - 2023-11-29T15:18:07+05:30 IST

శృతి హాసన్ ఈ సంవత్సరం టాప్ హీరోయిన్ గా అవబోతోంది. సంవత్సరం మొదట్లో సంక్రాంతికి విడుదలైన రెండు పెద్ద సినిమాలు ఘానా విజయం సాధించాయి, ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న 'సలార్' సినిమా డిసెంబర్ 22న విడుదలవుతోంది.

Shruti Haasan: ఈ సంవత్సరం హిట్ హీరోయిన్
Shruti Haasan

ఈ సంవత్సరం శృతి హాసన్ (ShrutiHaasan) కి ఒక ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం నాలుగు తెలుగు సినిమాలలో నటించగా అందులో రెండు ఈ సంవత్సరం మొదట్లో సంక్రాంతికి విడుదలయ్యాయి, ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో రెండు విడుదలవుతున్నాయి. ఆసక్తికరం ఏంటంటే సంక్రాంతికి విడుదలైన రెండు సినిమాలు పెద్ద విజయం సాధించాయి. దీనితో శృతి హాసన్ మిగతా నటీమణులతో పోలిస్తే చాలా పెద్ద విజయం సాధించిందనే చెప్పాలి. (Shruti Haasan is going to be the top actress of the year)

నందమూరి బాలకృష్ణతో (Nandamuri Balakrishna) చేసిన 'వీరసింహారెడ్డి' ముందుగా విడుదలై ఘన విజయం సాధించింది. తరువాతి రోజు విడుదలైన 'వాల్తేరు వీరయ్యలో' మెగా స్టార్ చిరంజీవి పక్కన చేసిన శృతి హాసన్ పండగనాడు విడుదలైన రెండు సినిమాలతో రెండు విజయాలు నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ సంవత్సరాంతం అయిన డిసెంబర్ నెలలో కూడా రెండు సినిమాలు ఆమెవి విడుదల కానున్నాయి.

shrutihaasaninamodernoutfit.jpg

నాని ప్రధాన పాత్రలో వస్తున్న 'హాయ్ నాన్న' #HiNanna సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది. అయితే ఇందులో ఒక చిన్న పాత్ర మాత్రమే చేస్తోంది ఆమె. తరువాత డిసెంబర్ 22 న విడుదల కానున్న 'సలార్' #Salaar సినిమా శృతి హాసన్ కెరీర్ లో పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ కథానాయకుడు, ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ సినిమా మొత్తం ప్రపంచం అంతా ఎదురు చూస్తున్న సినిమా కావటం విశేషం, అలాగే ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలవుతోంది. 'సలార్' సినిమా శృతి హాసన్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమాగా చెప్పొచ్చు. ఈ సినిమా విజయం సాధిస్తే ఇక ఈ సంవత్సరం శృతి హాసన్ ని టాప్ యాక్ట్రెస్ అఫ్ ది ఇయర్ గా ప్రకటించవచ్చు.

Updated Date - 2023-11-29T15:18:08+05:30 IST