ShrutiHaasan: రోల్ ఎలా వుంది అని కాదు అన్నయ్యా, హిట్ సినిమాలో వున్నామా లేదా అన్నదే పాయింట్ !

ABN , First Publish Date - 2023-04-30T15:55:10+05:30 IST

రెండు సినిమాలు విడుదల అయి హిట్ అయ్యాయి, ఇంకో రెండు సినిమాలు ఈ సంవత్సరమే విడుదల అవుతాయి. శృతి హాసన్ మొత్తం నాలుగు సినిమాలో మిగతా నటీమణుల కంటే దూసుకుపోతోంది

ShrutiHaasan: రోల్ ఎలా వుంది అని కాదు అన్నయ్యా, హిట్ సినిమాలో వున్నామా లేదా అన్నదే పాయింట్ !
Shruti Haasan

శృతి హాసన్ (ShrutiHaasan) ఈ సంవత్సరం ఒక గొప్ప ఛాన్స్ కొట్టేసింది. నాని30 #Nani30 సినిమాలో శృతి హాసన్ ఒక ప్రత్యేక రోల్ చేస్తోందని అధికారికంగా వార్త వచ్చింది, షూటింగ్ లో కూడా పాల్గొంటోంది అని. ఇది శృతి హాసన్ కి నాలుగో సినిమా ఈ సంవత్సరం విడుదల అవుతున్న సినిమాల్లో. నిజంగా ఈ సంవత్సరం శృతి హాసన్ గొప్ప ఛాన్స్ కొట్టేసినట్టే.

shrutihaasan3.jpg

జనవరిలో సంక్రాంతి కి విడుదల అయిన రెండు సినిమాలలో శృతి హాసన్ వుంది. ఒకటి బాలకృష్ణ (NandamuriBalakrishna) పక్కన నటించిన 'వీరసింహా రెడ్డి' (VeeraSimhaReddy) . ఇందులో శృతి హాసన్ కేవలం పాటలకే పరిమితం అయినా కూడా, ఈ సినిమా హిట్ సినిమా కిందకే లెక్కకి వస్తుంది, కాబట్టి ఆమె ఖాతాలో ఒక హిట్ వచ్చినట్టే. ఇక రెండో సినిమా 'వాల్తేరు వీరయ్య' (WaltairVeerayya), చిరంజీవి (MegaStarChiranjeevi) పక్కన చేసింది. ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలు అన్నిట్లోనూ పెద్ద హిట్. ఇందులో శృతి హాసన్ ఏజెంట్ గా చేసింది, ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇది కూడా ఆమె ఖాతాలో ఇంకో హిట్ సినిమా.

shrutihaasan4.jpg

ఇక ప్రభాస్ (Prabhas) పక్కన 'సాలార్' (Salaar) లో చేస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా, ప్రశాంత్ నీల్ (PrashanthNeel) దర్శకుడు. ఇది పెద్ద బడ్జెట్ సినిమా, ఇందులో శృతి హాసన్ కథానాయకురాలిగా చేస్తోంది. ఇది కూడా ఈ సంవత్సరమే అంటే సెప్టెంబర్ 28న విడుదల అవుతోంది. ఇక ఇప్పుడు నాని30 #Nani30 లో కూడా ఒక ప్రత్యక పాత్రలో కనపడుతోంది. ఈ సినిమా కూడా ఈ సంవత్సరమే విడుదల అవుతోంది. ఇలా నాలుగు సినిమా ఒకే సంవత్సరం విడుదల అవటం గొప్ప ఛాన్స్ కాకపోతే మరేంటి. ఈమధ్య పాన్ ఇండియా నటీమణుల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి, కానీ శృతి హాసన్ హిట్ సినిమాలో ఉంటోంది. సక్సెస్ చూస్తారు, రోల్ చూడరు అది మాటర్ బాసూ !

Updated Date - 2023-04-30T15:55:10+05:30 IST