Shruti Haasan: ప్రియుడు గురించి భావోద్వేగ పోస్ట్‌!

ABN , First Publish Date - 2023-01-24T18:34:28+05:30 IST

శ్రుతీహాసన్‌ సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆమె తదుపరి చిత్రం సలార్‌ షూటింగ్‌ కోసం ఎదురుచూస్తోంది.

Shruti Haasan: ప్రియుడు గురించి భావోద్వేగ పోస్ట్‌!

శ్రుతీహాసన్‌ (Shruti Haasan)సంక్రాంతి బరిలో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న ఆమె తదుపరి చిత్రం సలార్‌ షూటింగ్‌ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఆమె శాంతాను హజారికా (santanu hazarika)అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే! అతనిలో కలిసి టూర్లు, ఫుడ్‌ డేట్స్‌కు వెళ్తుంటుంది. అయితే అతనితో పెళ్లి గురించి మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఆమె ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది శ్రుతీ.

‘‘ఈ ప్రపంచంలో నీకంటే సంతోషంగా నన్ను ఎవరూ చూసుకోలేరు’’ అంటూ ఫన్నీ ఎమోజీని జోడించారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. (Emotional post)

ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు చిత్రాలతో అలరించిన ఈ చెన్నై చిన్నది ‘సలార్‌’ చిత్రంలో ప్రభాస్‌ సరసన నటిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-01-24T18:35:15+05:30 IST