కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shree Leela : లిప్‌లాక్‌ ఇష్టం లేదు... ఒకవేళ చేయాల్సి వస్తే మొదటి లిప్‌కిస్‌ అతనికే!

ABN, First Publish Date - 2023-10-26T17:15:25+05:30

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్, మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉండీ తెలుగు బ్యూటీ. ఆమె నటించిన చిత్రాలు ఆగస్ట్‌ నుంచి జనవరి వరకూ నెలకో సినిమా చొప్పున విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 'భగవంత్  కేసరి' చిత్రంలో విజ్జి పాత్రతో పలకరించింది.

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్, మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు శ్రీలీల. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉండీ తెలుగు బ్యూటీ. ఆమె నటించిన చిత్రాలు ఆగస్ట్‌ నుంచి జనవరి వరకూ నెలకో సినిమా చొప్పున విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 'భగవంత్  కేసరి' చిత్రంలో విజ్జి పాత్రతో పలకరించింది. ఆ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమెకు క్రేజీ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్‌ హీరోలతో లిప్‌లాక్‌ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని సదరు యాంకర్‌ అడగగా చాలా తెలివిగా సమాధానంచెప్పింది శ్రీలీల. కాసేపు టైమ్‌ తీసుకుని ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చింది. ''నేను ఏ హీరోతో లిప్‌ లాక్‌ సన్నివేశాల్లో నటించనని' ఓపెన్‌గానే చెప్పేసింది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే నా ఫస్ట్‌ లిప్‌ కిస్‌ తన భర్తకే ఇస్తానని చెప్పింది. అంటే ముద్దు సీన్లకు సిద్ధంగా లేనని చెప్పకనే చెప్పింది శ్రీలీల.(Shree leela)

పంజా వైష్ణవ్‌ తేజ్‌, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం నుంచి 'లీలమ్మో’ అనే పాటను ఇటీవల విడుదల చేశారు. అయితే ఈ పాటలో శ్రీలీల డాన్స్ ఓ రేంజ్‌లో చేసింది. తదుపరి ఆమె మహేశ్‌బాబుతో గుంటూరు కారం, పవన్‌ కల్యాణ్‌తో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, విజయ్‌ దేవరకొండతో ఓ సినిమా, నితిన్తో ఓ సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉంది.

Updated Date - 2023-10-26T17:15:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!