Shraddha Kapoor: 4కోట్ల లంబోర్గిని కారు కొన్న ప్ర‌భాస్ హీరోయిన్‌

ABN , First Publish Date - 2023-10-25T17:14:29+05:30 IST

సాహో సినిమాలో ప్ర‌భాస్‌కు జ‌త‌గా న‌టించిన బాలీవుడ్ సుంద‌రి శ్ర‌ద్ధాక‌పూర్ (Shraddha Kapoor) రూ.4 కోట్ల ఖ‌రీదైన లంబోర్గిని హురాకాన్ టెక్నికా(Lamborghini Huracan Tecnica supercar) కారును కొనుగోలు చేసింది. అనంత‌రం త‌న క‌ల‌ల కారును ముంబై వీధుల్లో న‌డుపుతూ ఎంజాయ్ చేసింది.

Shraddha Kapoor: 4కోట్ల లంబోర్గిని కారు కొన్న ప్ర‌భాస్ హీరోయిన్‌
Shraddha Kapoor lamborgini

సాహో సినిమాలో ప్ర‌భాస్‌కు జ‌త‌గా న‌టించిన బాలీవుడ్ సుంద‌రి శ్ర‌ద్ధాక‌పూర్ (Shraddha Kapoor) రూ.4 కోట్ల ఖ‌రీదైన లంబోర్గిని హురాకాన్ టెక్నికా(Lamborghini Huracan Tecnica supercar) కారును కొనుగోలు చేసింది. అనంత‌రం త‌న క‌ల‌ల కారును ముంబై వీధుల్లో న‌డుపుతూ ఎంజాయ్ చేసింది. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా బుధ‌వారం నాడు ఆమె స్వ‌యంగా న‌డుపుకుంటూ వెళ్లి కారుకు ప్రత్యేక పూజ‌లు చేయించింది. 325 kmph వేగంతో న‌డిచే ఈ కారుతో వంద కిలోమీట‌ర్ల లోపు గ‌మ్యాల‌ను 3.2 సెక‌న్ల‌లో చేరుకోవ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.

సీనియ‌ర్ న‌టుడు శ‌క్తి క‌పూర్ త‌న‌య‌గా అషికీ 2 సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన సుంద‌రి ఆ చిత్రం హిట్‌తో మ‌ళ్లీ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళుతున్న‌ది. ఆ త‌రువాత ఈ సుంద‌రి న‌టించిన స్త్రీ, హైద‌ర్‌, బాగీ, ఏబీసీడీ వంటి విజ‌య‌వంత‌మైన‌ చిత్రాలు చేస్తూ వ‌చ్చి స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం దేశంలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే తార‌ల జాబితాలో ఉంది.


sradda.jpg

2019లో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌(Prabhas)తో సాహో చిత్రం ద్వారా తెలుగునాట కూడా గుర్తింపు సంపాదించింది. చివ‌ర‌గా శ్ర‌ద్ద తూ జూటీ మై మ‌క్క‌ర్ చిత్రంలో ర‌ణ‌బీర్ క‌పూర్ స‌ర‌స‌న‌ న‌టించింది. ఈ సినిమాలో అమ్మ‌డు మ‌ద్దు సీన్లు, బికినీ సీన్ల‌లో రెచ్చిపోయి న‌టించి కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేసింది. ఇప్ప‌టికీ ఈ స‌నిమాలోని స‌న్నివేశాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్ర‌స్తుతం శ్ర‌ద్దాక‌పూర్ కామోడీ, హ‌ర‌ర్ చిత్రంగా వ‌చ్చి భారీ విజ‌యాన్ని సాధించిన స్త్రీకి సీక్వెల్‌గా వ‌స్తున్న‌ స్త్రీ2లో న‌టిస్తున్న‌ది.

Updated Date - 2023-10-25T17:14:29+05:30 IST