Shraddha Das: మళ్ళీ శ్రద్ధదాస్ ఏమి చేసిందో చూస్తే షాక్ అవుతారు...

ABN , First Publish Date - 2023-04-10T16:01:15+05:30 IST

శ్రద్ధదాస్ కొత్త సినిమా 'పారిజాత పర్వం' సినిమా పోస్టర్ ఈరోజు విడుదల అయింది. ఈ సినిమాలో శ్రద్ధ కథానాయకురాలు తో పాటు ఒక పాట కూడా పడింది...

Shraddha Das: మళ్ళీ శ్రద్ధదాస్ ఏమి చేసిందో చూస్తే షాక్ అవుతారు...
Shraddha Das

శ్రద్ధదాస్ (Shraddha Das) ఇప్పుడు తెలుగు లో చాల బిజీ నటి అయిపొయింది. ఇటు బుల్లితెర మీద కనిపిస్తూ, అటు వెండితెర మీదా కూడా రెండింటిలోనూ పనితో చాలా బిజీ గా వుంది. అందుకే హైదరాబాద్, ముంబై వారానికొకసారి తిరుగుతూ కనిపిస్తూ వుంది. అదీ కాకుండా మధ్య మధ్యలో టైమ్ దొరికినప్పుడు ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వడానికి శ్రీలంక కూడా వెళ్ళింది. ఇలా శ్రద్ధ బిజీ అయిపొయింది.

shraddhadas-new1.jpg

శ్రద్ధదాస్ కొత్త సినిమా 'పారిజాత పర్వం' (Parijatha Parvam) పోస్టర్ విడుదల అయింది ఈరోజు. అందులో శ్రద్ధదాస్ ముఖ్య పాత్ర అంటే టైటిల్ రోల్ పోషిస్తోంది. పారిజాతగా కనపడుతున్న శ్రద్ధ కాకుండా ఇందులో సునీల్ (Sunil), శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) ఇంకా మరికొందరు నటులు వున్నారని అర్థం అవుతోంది. సంతోష్ కంభంపాటి (Santosh Kambhampati) దీనికి దర్శకుడు.

shraddhadas-new2.jpg

"ఇది పూర్తిగా ఒక కామెడీ సినిమా," అని చెప్తోంది శ్రద్ధ. అయితే ఇందులో ఇంకో షాకింగ్ వార్త ఏంటి అంటే, శ్రద్ధ దాస్ నటించటమే కాకుండా ఇందులో ఒక పాట కూడా పాడింది. "నేను ఇంతకు ముందు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం లో ఛార్మి కి ఒక పాట పాడాను. కానీ ఇప్పుడు నా కోసమే నేను పాట పాడటం ఇది మొదటిసారి. చాలా బాగా వచ్చింది ఆ పాట, త్వరలోనే మీ అందరూ వింటారు," అని చెప్పింది శ్రద్ధ. 'పారిజాత పర్వం' సినిమా షూటింగ్ మొత్తం అయిపొయింది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పని నడుస్తోంది. త్వరలోనే థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అవుతుంది అని చెప్పింది శ్రద్ధ.

shraddha1.jpg

ఇదే కాకుండా 'లేచింది మహిళా లోకం' (Lechindi Mahila Lokam) అనే సినిమా కూడా చేస్తోంది. ఇది కూడా కామెడీ సినిమానే. ఇందులో మంచు లక్ష్మి (Lakshmi Manchu), అనన్య నాగెళ్ల (Ananya Nagella) కూడా శ్రద్ధ తో పాటు నటిస్తున్నారు. ఈ రెండు కాకుండా 'అర్థం' (Arrdham) అనే సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమాలో శ్రద్ధ దాస్ లీడ్ యాక్ట్రెస్ గా చేస్తోంది. ఇది హారర్ మూవీ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అని చెప్తోంది. దీనికి మణికాంత్ (Manikanth) దర్శకుడు కాగా, మాస్టర్ మహేంద్ర ఇందులో లీడ్ యాక్టర్.

shraddhadas-new3.jpg

ఇంకా బీచ్ ఫోటోస్ గురించి మాట్లాడుతూ అవి శ్రీ లంక వెళ్ళినప్పుడు తీసుకున్నవి అని చెప్తోంది శ్రద్ధ. అక్కడ ప్రోగ్రామ్ ఇవ్వటానికి వెళ్లాను అని, అప్పుడు తీసుకున్నావని చెప్పింది. శ్రీలంకలో పరిస్థితి కూడా ఇప్పుడు మామూలుగా ఉందని, తనకేమి ఇబ్బంది ఎదురు కాలేదని చెప్పింది.

Updated Date - 2023-04-10T16:01:16+05:30 IST