Allu Arjun: 'పుష్ప 2' లో అల్లు అర్జున్ లుక్ షాకింగ్

ABN , First Publish Date - 2023-04-07T17:30:19+05:30 IST

సుకుమార్ ప్రేక్షకులకి కొంచెం కొంచెం గా 'పుష్ప 2' కథ ఎలా ఉండబోతోందో అనే విషయం బయటపెడుతున్నాడు. ఈరోజు టీజర్ విడుదల చేశారు, అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా, ఇందులో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉందంటే...

Allu Arjun: 'పుష్ప 2' లో అల్లు అర్జున్ లుక్ షాకింగ్

అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'పుష్ప 2' (Pushpa 2) నుంచి అల్లు అర్జున్ పుట్టినరోజు (#HBDAlluArjun) సందర్భంగా ఈరోజు అంటే శుక్రవారం, ఏప్రిల్ 7 వ తీదీన ఒక చిన్న టీజర్ లా (PushpaTeaser) సినిమా నిర్వాహకులు విడుదల చేశారు. ఆ టీజర్ అప్పుడే వైరల్ అవుతోంది కూడా. ఇందులో 'పుష్ప ఎక్కడ' (#WhereIsPushpa) అన్న కాన్సెప్ట్ తో తీసిన టీజర్ అది. చివరికి పుష్ప కనిపించి ఇంక పుష్ప గాడి రూల్ మొదలయింది అనేట్టుగా చెప్పారు.

pushpa2alluarjun.jpg

దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ టీజర్ లో బాగా హైప్ చూపించాడు పుష్ప (#Pushpa) కోసం. ఎటు పోయాడు, ఎక్కడికి పోయాడు, బుల్లెట్స్ తగిలి చనిపోయాడా, ఎక్కడ పుష్ప అన్న విషయాన్ని బాగా హైప్ చేయగలిగాడు. (#HBDAlluArjun) అలాగే పుష్ప అనేవాడు డబ్బు ఎలా సంపాదించాడు అని కాదు, సంపాదించినా డబ్బును ఏమి చేసాడు అనే విషయం కూడా చూపించాడు సుకుమార్.

pushpa2alluarjun1.jpg

మొదటి పార్టు 'పుష్ప' విడుదల అయ్యాక కొంచెం విమర్శలు వచ్చాయి. ఏంటి కథానాయకుడిని ఒక స్మగ్లర్ గా చూపించాడు, అదెలా ఎందుకు అంత నెగటివ్ గా చూపించటం అని. విడుదల అయినప్పుడు కొందరు విమర్శించారు.

pushpa2alluarjun2.jpg

అందువల్లనేమో మరి సుకుమార్ ఈ పార్టు 2 లో పుష్ప జనాలకి ఏమి చేసాడు, ఎన్ని చేసాడో అన్న విషయం చూపించాడు. బిడ్డకి వైద్యంపై అయ్యే ఖర్చు, అలానే చాలామందికి సాయం చేసాడు అని చూపించాడు.

pushpa2alluarjun3.jpg

అలాగే అడవిలో పులి ఎలా భయం లేకుండా తిరుగుతుందో పుష్ప కూడా భయం లేకుండా అదే అడవిలో తిరుగుతూ ఉంటాడు. అదీ కాకుండా, చచ్చిపోయాడు అనుకున్న పుష్ప ఎలా బతికేడు ఏంటి, అసలు ఎందుకు అతని మీద కాల్పులు ఇవన్నీ ఆసక్తికరంగా ఉండేట్టు చేసాడు సుకుమార్ ఈ టీజర్ తో.

pushpa2alluarjun4.jpg

ఇవన్నీ ఒక ఎత్తు భయం ఎరుగని, ధైర్యం అంటేనే పుష్ప అనే అతని మీద కాల్పులు జరిపేటంత ధైర్యం ఎవరికి వచ్చింది, కథ ఎలా వుండబోతోంది అనే ఆసక్తి కూడా కనబరిచాడు ఈ టీజర్ తో. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-04-07T17:35:44+05:30 IST