Agent: షాకింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్, ఇలా ఎన్నడూ జరగలేదు

ABN , First Publish Date - 2023-04-29T11:35:44+05:30 IST

సుమారు 80 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి తీసిన 'ఏజెంట్' నిన్న శుక్రవారం విడుదల అయింది. అఖిల్ అక్కినేని నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు కూడా వున్నాయి. అయితే మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం చాలా షాకింగ్ గా వున్నాయి.

Agent: షాకింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్, ఇలా ఎన్నడూ జరగలేదు

అఖిల్ అక్కినేని (AkhilAkkineni), దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender Reddy) కాంబినేషన్ లో వచ్చిన 'ఏజెంట్' #Agent సినిమా నిన్న శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు వున్నాయి. అదీ కాకుండా ఇది ఒక పెద్ద బడ్జెట్ సినిమా, ఈ సినిమా విడుదలకి ముందు నిర్మాత అనిల్ సుంకర #AnilSunkara, అఖిల్ అక్కినేని #AkhilAkkineni, దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడేరు. అలాగే ప్రభాస్ #Prabhas కి 'బాహుబలి' #Baahubali ఎలాగో, ఈ 'ఏజెంట్' #Agent అఖిల్ అక్కినేని కి అంతలా వర్కౌట్ అవుతుందని చెప్పారు.

Akhil-2.jpg

కానీ శుక్రవారం ఉదయం మార్నింగ్ షో 7.20 గంటలకు పడిన కొంతసేపటికి, ప్రేక్షకులకి అర్థం అయిపొయింది ఈ సినిమా గురించి. ఇక అక్కడ నుండే ఈ సినిమా నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈమధ్య ప్రేక్షకులు కూడా చాలా తెలివి మీరిపోయారు, ఉదయం ఆట చూసి బాగుంది అని టాక్ వస్తేనే, మధ్యాహ్నం, రాత్రి షోస్ బుక్ చేసుకుంటున్నారు.

కానీ ఈ సినిమా ఉదయం నుంచే బాగోలేదు అని టాక్ స్ప్రెడ్ అవడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు అని తెలిసింది. అందుకే మధ్యాహ్నం, రాత్రి ఆటలు కొంచెం డల్ అయ్యాయి. ఈ సినిమాకి బడ్జెట్ 80 కోట్లు అయిందని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే మొత్తం ప్రపంచం అంతా కలిపి రూ.4.95 కోట్లు మాత్రమే షేర్ కలెక్టు చేసింది. ఇది ఎప్పుడు మిగతా డబ్బులు ఎప్పుడు కలెక్టు చెయ్యాలి, ఎప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి, చాలా కష్టం.

Agent-Akhil.jpg

ఇప్పటికే ఈ సినిమా మీద చాలా నెగటివ్ టాక్ ఉండటం వలన, ఈ శని, ఆదివారాలు కూడా ఈ సినిమా కలెక్షన్స్ పెరిగే అవకాశం లేదు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. మమ్ముట్టి (Mammootty), డినో మోరియా (Dino Morea) కూడా ఇందులో నటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం రూ.4 కోట్లు మాత్రమే కలెక్టు చేసింది. ఇది చాలా తక్కువ.

Updated Date - 2023-04-29T11:35:44+05:30 IST