Kotabommali PS: ఇది క్యాట్ వాక్ కాదు సినిమా షూటింగ్, శివానీతో దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్

ABN , First Publish Date - 2023-11-15T14:03:39+05:30 IST

సీనియర్ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ 'కోటబొమ్మాళి పీఎస్' సినిమాలో పోలీసు కానిస్టేబుల్ పాత్ర చేస్తోంది. ఈ సినిమా మొదటి రోజు మొదటి సన్నివేశం షూటింగ్ చేస్తుండగా, శివాని కి దర్శకుడు ఇచ్చిన షాకింగ్ సలహా ఏంటో తెలుసా...

Kotabommali PS: ఇది క్యాట్ వాక్ కాదు సినిమా షూటింగ్, శివానీతో దర్శకుడు తేజ షాకింగ్ కామెంట్
Shivani Rajasekhar

మలయాళంలో హిట్ అయిన 'నయట్టు' #Nayattu సినిమాని తెలుగులో 'కోటబొమ్మాళి పీఎస్' #KotabommaliPS గా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 24న విడుదలవుతోంది. ఇందులో శ్రీకాంత్ (Srikanth), శివాని రాజశేఖర్ (ShivaniRajasekhar), రాహుల్ విజయ్ (RahulVijay), వరలక్ష్మి శరత్ కుమార్ (VaralakshmiSarathKumar) ముఖ్యపాత్రలు ధరిస్తున్నారు. తేజ మార్ని (TejaMarni) దర్శకుడు, బన్నీ వాసు (BunnyVasu) నిర్మాత. ఈ సినిమా పోలీసు శాఖలో వుండే డార్కు వేపు, అలాగే రాజకీయ నాయకులు పవర్ కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు, ఆలా తీసుకోవటంలో పోలీసు శాఖలో కొంతమంది వ్యక్తులు ఎలా సఫర్ అయ్యారు అనే నేపథ్యంలో ఉంటుంది.

shivanirajasekharkotabommal.jpg

శివాని రాజశేఖర్ ఇందులో పల్లెటూర్లో వుండే ఒక పోలీసు కానిస్టేబుల్ గా వేసింది. మొదటి రోజు పోలీసు యూనిఫార్మ్ వేసుకొని కెమెరా ముందు సన్నివేశంలో నటించింది. ఆమె నడుస్తుంటే దర్శకుడు తేజ పరిగెత్తుకుంటూ వచ్చి, "మేడం, ఇది క్యాట్ వాక్ కాదు, పల్లెటూర్లో ఉంటే ఒక పోలీసు కానిస్టేబుల్, కొంచెం నడక మార్చండి," అని చెప్పాడట. శివాని అతను అలా చెప్పగానే నవ్వుకొని, అలాగే అంటూ అప్పుడు నడిచి చూపించింది. దర్శకుడు హ్యాపీ ఫీల్ అయ్యాడట.

shivanirajasekharkotabommali.jpg

ఇందులో కోటబొమ్మాళి అనే వూరు శ్రీకాకుళం జిల్లాలో వుంది. అందుకని అందరూ శ్రీకాకుళం యాస మాట్లాడుతారు అని చెప్పింది శివాని. అయితే తనకి ఎక్కువ మాటలు సినిమాలో లేవు అని చెప్పింది. శివాని తండ్రి రాజశేఖర్ పోలీసు ఆఫీసర్ పాత్రలకు మంచి పేరు పొందారు. అతను ఇచ్చిన సలహా, జాగ్రత్తగా చెయ్యి, పోలీసు అంటే ఆ డ్రెస్ అది ఫిట్టింగ్ చూసుకో అని చెప్పారు. "కథలో బాగా ఇన్వాల్వ్ అయ్ చేయి, అంతే కానీ ఎక్కువ నటించకు" అని చెప్పారు అని చెప్పింది శివాని.

Updated Date - 2023-11-15T14:03:41+05:30 IST