#SharwanandMarriage: శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా...

ABN , First Publish Date - 2023-01-05T16:05:26+05:30 IST

శర్వా త్వరలో పెళ్లిచేసుకో బోతున్నాడు అని. రెండు వారాల కిందట పెళ్లి ఫిక్స్ అయిందని, ఇప్పుడే శర్వానంద్ తల్లిదండ్రులు అందరికి శర్వా కి పెళ్లి కుదిరిందని చెప్తున్నారని తెలిసింది. పెళ్లి ఏప్రిల్ లో చేసేస్తారని కూడా తెలిసింది.

#SharwanandMarriage: శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా...

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లలో ఒకరు శర్వానంద్. (Sharwanand is one of the most eligible bacherors of Tollywood) ఈమధ్య ఇంటర్వ్యూ, రియాలిటీ షో లో వచ్చిన శర్వానంద్ తన పెళ్లి ఎప్పుడంటే ప్రభాస్ (Prabhas) చేసుకున్నాక అని సమాధానం చెపుతూ ఉండేవాడు. అయితే ఇప్పుడు అధికారికంగా వచ్చిన వార్త ఏంటి అంటే, శర్వా త్వరలో పెళ్లిచేసుకో బోతున్నాడు అని. రెండు వారాల కిందట పెళ్లి ఫిక్స్ అయిందని, ఇప్పుడే శర్వానంద్ తల్లిదండ్రులు అందరికి శర్వా కి పెళ్లి కుదిరిందని చెప్తున్నారని తెలిసింది. పెళ్లి ఏప్రిల్ లో చేసేస్తారని కూడా తెలిసింది. (Sharwanand is going to marry a girl where she is very close to Bojjala family.

sharwa1.jpg

అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, అమ్మాయి ఎవరా అని కదా. అమ్మాయి రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసింది. అమెరికా లో వుద్యోగం చేస్తోంది అని, కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉందని కూడా తెలిసింది. ఆమె సాంఘీక మాధ్యమాలకు చాలా దోరం అని కూడా తెలిసింది. అయితే ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర అని తెలిసింది. బొజ్జలకి మనవరాలు అవుతుందని, శర్వా ఆమెని ఒక స్నేహితుడి ద్వారా కలిసాడని కూడా తెలిసింది. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు, సుధీర్ (Bojjala Sudhir Reddy) కి బాగా దగ్గరివాళ్ళు అని కూడా తెలిసింది. ఆ తరువాత పెద్దవాళ్ళు వెళ్లి మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేసారని తెలిసింది. దీనితో టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచులర్ లో ఒకరు అయిన శర్వానంద్ ఒక ఇంటివాడు అవుతున్నాడు. ఏప్రిల్ లో పెళ్లి ఫిక్స్. (#SharwanandMarriage)

Updated Date - 2023-01-05T16:07:20+05:30 IST